Kidney Stones: ఉప్పు తింటే కిడ్నీల్లో రాళ్లు పెరుగుతాయా? ఈ చిట్కాలతో రాళ్ల సమస్య దరిచేరదంతే..!

ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్లు సమస్య ఈ మధ్య కాలంలో అందరినీ వేధిస్తుంది. అధికంగా పని గంటలు, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడంతో  సమస్య మరింత పెరగుతుంది. కిడ్నీ స్టోన్స్ విపరీతమైన కడుపు నొప్పితో బాధపడే అవకాశం ఉంటుంది.

Kidney Stones: ఉప్పు తింటే కిడ్నీల్లో రాళ్లు పెరుగుతాయా? ఈ చిట్కాలతో రాళ్ల సమస్య దరిచేరదంతే..!
బ్లడ్ ప్రెజర్-బ్లడ్ షుగర్: అధిక రక్తపోటు, అధిక రక్త చక్కెర స్థాయిలు మూత్రపిండాల వ్యాధికి ప్రధాన ప్రమాద కారకాలు. రక్తపోటు, బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడానికి రెగ్యులర్ చెక్-అప్‌లను పొందాలని, అవసరమైన మందులు తీసుకోవాలని నిర్ధారించుకోండి.
Follow us
Srinu

|

Updated on: Jan 28, 2023 | 10:36 AM

అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు మన శరీరాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా మనం అనేక హానికరమైన వ్యాధులకు గురవుతాం. ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్లు సమస్య ఈ మధ్య కాలంలో అందరినీ వేధిస్తుంది. అధికంగా పని గంటలు, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడంతో  సమస్య మరింత పెరగుతుంది. కిడ్నీ స్టోన్స్ విపరీతమైన కడుపు నొప్పితో బాధపడే అవకాశం ఉంటుంది. అయితే కిడ్నీలో రాళ్లతో బాధపడుతూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  ధీర్ఘకాలికంగా కిడ్నీల్లో రాళ్లు ఉంటే కిడ్నీ పనితీరుపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంటున్నారు.  అలాగే మూత్ర విసర్జన సమయంలో నొప్పి, ఎక్కువ సార్లు మూత్రం రావడం, కడుపులో నొప్పి, ఆకలి లేకపోవడం, వికారం, జ్వరం వంటివి కిడ్నీల్లో రాళ్ల సమస్యలకు లక్షణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు. అందుకే రాళ్ల సమస్య ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కాబట్టి కిడ్నీ సమస్యతో బాధపడేవారు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

ఉప్పు అధికంగా తినడం

మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఉప్పు అధికంగా ఉంటే కిడ్నీల్లో రాళ్ల సమస్య పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు అధికంగా తీసుకుంటే మూత్రంలో కాల్షియం మొత్తాన్ని పెంచుతుందని, ఇది కిడ్నీల్లో రాళ్ల సమస్యకు కారణం అవుతుందని పేర్కొంటున్నారు. కాబట్టి ఉప్పు వాడకం విషయంలో జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు.

శీతలపానియాలకు దూరం

చాలా మంది కిడ్నీల్లో సమస్యలున్న రోగులు డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి వీరు అధికంగా నీరు తాగడం మంచిది. శీతల పానియం తాగడం వల్ల ముందుగానే దాహం తీరిపోయి నీటిని తక్కువగా తాగుతాం. అలాగే కొన్ని రకాల శీతలపానియాల్లో ఉండే కెఫిన్ కూడా రాళ్ల సమస్యను పెంచుతుందని, కాబట్టి వాటికి దూరంగా ఉంటేనే మేలని నిపుణుల వాదన.

ఇవి కూడా చదవండి

నాన్ వెజ్ కు దూరం

మాంసం, చేపలు, గుడ్లు వంటి మాంసాహార పదార్థాల్లో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. ఇది కిడ్నీ స్టోన్ రోగులకు మంచిది కాదు. కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉన్న ఆహారం ప్రోటీన్లు తక్కువుగా ఉండేలా చూసుకోవడం ఉత్తమం.

టమాట

టమాటాను ఈ మధ్య ప్రతి కూరలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉన్న టమాటాకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. టమాటాల్లో అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. కాబట్టి కిడ్నీ రాళ్లు ఉన్న టమాటాను అస్సలు తినకూడదు. తప్పనిసరై కూరల్లో టమాటాను వినియోగించాల్సి వస్తే దాని గింజలు తీసేసి వాడుకోవడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..