ప్రయాణంలో ఎందుకు నిద్రపోతారో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ఏదైనా చదువుతుండటం, లేదంటే కారు నడుపుతున్న వ్యక్తితో మాట్లాడుతుండటం చేస్తుంటారు. లేదంటే సెల్‌ఫోన్‌తో బిజీగా ఉంటారు. వీటన్నింటి వల్ల అతని మనసు ప్రశాంతంగా ఉండదు. కాబట్టి అతనికి నిద్ర పట్టదు.

ప్రయాణంలో ఎందుకు నిద్రపోతారో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Traveling
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 28, 2023 | 9:46 AM

మనం కారులోనో,బస్సులోనో ఎక్కువ దూరం ప్రయాణం చేస్తున్నప్పుడు..వాహనంలో కూర్చున్న వెంటనే నిద్ర రావటం సహజం. ఇది చాలామందికి కలుగుతుంది. అయితే, ప్రయాణం చేస్తూ నిద్ర పోతున్నారంటే.. మీరు ఎంత అలసిపోయి ఉంటారో అర్థమవుతుంది. అందుకే నిద్ర మత్తుగా ఉందంటారు. కానీ ఇక్కడ రివర్స్‌గా జరుగుతుంది. మీరు కారులో కూర్చున్న వెంటనే, కొంత దూరం వెళ్లగానే మీ కళ్ళు ఆటోమేటిక్‌గా మూసుకుపోతాయి. క్షణాల్లో మీరు నిద్రపోతారు. దీనికి కారణం ఏంటో తెలుసా? దీని వెనకాల ఏదైనా వ్యాధి కారణంగా ఉందా? వాస్తవానికి దీనికి కారణం ఏమిటో..? దాని వెనుక ఉన్న లాజిక్ సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రయాణ సమయంలో వచ్చే నిద్ర గురించి, హైవే హైప్రోరిస్ వల్ల ఇలా జరుగుతుందని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనికి నిద్ర లేమి ఒక కారణం కావచ్చు. చాలా మంది ప్రజలు మరుసటి రోజు ప్రయాణం గురించి చాలా ఉత్సాహంగా ఉంటారు. దీని కారణంగా వారు తగినంత నిద్రపోరు. ముందు రోజు అలసట నుండి బయటపడటానికి, ప్రజలు ప్రయాణంలో నిద్రపోతారు. నిజానికి, మీరు ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడు, కారులో కూర్చోవడానికి ముందు, మీ మనస్సులో ఎన్నో రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి.వెంట తీసుకెళ్లాల్సినవి ఏమైనా వదిలేశామా..? ఇంట్లో లైట్లన్నీ ఆర్పివేసి ఉన్నాయా, కిటికీలు తలుపులు సరిగ్గా మూశారా..? గ్యాస్ స్టవ్ ఆఫ్ చేశామా లేదా..? ఇలా ఎన్నో మదిలో మెదులుతూనే ఉంటాయి. ఇది మిమ్మల్ని మానసికంగా అలసిపోయేలా చేస్తుంది. కానీ, ప్రశాంతం ప్రయాణం మొదలు పెట్టగానే మీరు ఈ చింతల నుండి విముక్తి పొందుతారు. ఆ తర్వాత మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు నిద్రపోవడం ప్రారంభిస్తారు.

డ్రైవర్ ఎందుకు నిద్రపోడు.. ఇదిలావుంటే, డ్రైవర్‌కి ఎందుకు కూడా నిద్ర పట్టడం లేదనే ప్రశ్న మీలో తలెత్తవచ్చు..కారు, బస్సు నడిపించే వ్యక్తి ఇంటి గురించి చింతించడు, మనసులో టెన్షన్ పడడు అని అనుకోవద్దు. అస్సలు అలాంటిది కాదు. నిజానికి మన మనస్సు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకు నిద్రపడుతుంది. డ్రైవర్‌ వాహనాన్ని నడుపుతున్నాడు కాబట్టి అతని మనస్సు, కళ్ళు ముందు రోడ్డుపైనే ఉంటాయి. అతని పూర్తి శ్రద్ధ డ్రైవింగ్ పైనే ఉంటుంది. దాని కారణంగా అతను నిద్రపోడు. అదేవిధంగా, మీరు కారులో మెలకువగా కనిపించిన వ్యక్తులను జాగ్రత్తగా గమనిస్తే, వారు మరేదో ఒకటి చేస్తుంటారు. ఏదైనా చదువుతుండటం, లేదంటే కారు నడుపుతున్న వ్యక్తితో మాట్లాడుతుండటం చేస్తుంటారు. లేదంటే సెల్‌ఫోన్‌తో బిజీగా ఉంటారు. వీటన్నింటి వల్ల అతని మనసు ప్రశాంతంగా ఉండదు. కాబట్టి అతనికి నిద్ర పట్టదు.

ఇవి కూడా చదవండి

కారులో కూర్చున్న తర్వాత చాలా మందికి నిద్ర రావటం సహజం. ఎందుకంటే కారు కదులుతూనే ఉంటుంది. ఎలాగంటే..చిన్న పిల్లల్ని ఒడిలో పడుకోబెట్టుకుని వీపు మీద తడుముతూ ఉంటాం కదా..! ఇప్పుడు కారు ప్రయాణంలోనూ చేస్తున్నప్పుడు అలాంటి భావనే కలుగుతుంది. పిల్లలను నిద్రించడానికి అదే విధానాన్ని అనుసరిస్తారు కూడా చాలా మంది..ఇది చాలా బాగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

పిల్లలను ఊయలలో వేసి ఊపుతున్నప్పుడు కూడా కొద్దిసేపటి తర్వాత వారు నిద్రలోకి జారుకుంటారు. సైన్స్ భాషలో, ఈ మొత్తం ప్రక్రియను రాకింగ్ సెన్సేషన్ అంటారు. రాకింగ్ సెన్సేషన్ అంటే మీరు ఒక ప్రవాహంలో రాకింగ్ చేస్తూనే ఉన్నప్పుడు, మీకు నిద్ర రావడం మొదలవుతుంది. కారు ఒక ఊపులో కదులుతున్నప్పుడు, మీరు అక్కడే కూర్చొని నిద్రపోవడానికి ఇదే కారణం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే