విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న కొడుకు.. అమ్మ తన ఆఫీస్ చూడాలని ఏం చేశాడో తెలుసా..? నువ్ సూపర్ బ్రో..
ఒక వినియోగదారు అద్భుతం.. ఇది నిజంగా అద్భుతం అని వ్రాశాడు. మరొక వినియోగదారు..ప్రియమైన సోదరా, మీరు ఎవరో నాకు తెలియదు? కానీ నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. నీకు అభినందనలు..
ఈ రోజుల్లో తల్లిదండ్రులను గౌరవించడం, వారికి సేవ చేయటం బరువుగా భావిస్తున్నారు చాలా మంది. వృద్ధాప్యం రాగానే తల్లిదండ్రలును అనాథ శరణాలయాల్లో వదిలేసి చేతులు దులుపుకుంటున్నారు. అలాంటి కొడుకులు, కూతుర్లు ఉన్న నేటి కాలంలో ఓ యువకుడు చేసిన పని ఎందరికో మేలుకొలుపుని కలిగిస్తుంది. సింగపూర్‌లో పనిచేస్తూ అక్కడే సెటిల్ అయిన ఒక భారతీయుడు ఒక గొప్ప పనిచేశాడు. స్వదేశం విడిచి ఎక్కడో సింగపూర్‌లో నివసిస్తున్న తాను.. తన తల్లి కూడా బయటి ప్రపంచాన్ని చూడాలని కోరుకున్నాడు. అందుకోసం అప్పుడప్పుడూ అమ్మనాన్నలను సింగపూర్ తీసుకెళ్తూనే ఉంటాడు.. అయితే, ఇటీవల తన తల్లిని సింగపూర్ ట్రిప్ కి తీసుకెళ్లిన అతను.. తమ ఈ టూర్ కు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు.
అమ్మను సింగపూర్ తీసుకెళ్లిన వ్యక్తి పేరు జె.దత్తాత్రయ.తన తల్లితో కలిసి సింగపూర్ పర్యటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దానికి ఒక క్యాప్షన్ ఇచ్చాడు. తన తరంలో విదేశాలకు వెళ్లిన మొదటి మహిళ అని రాశాడు. దత్తాత్రయ కొన్ని రోజుల క్రితం తాను, తన తల్లితో కలిసి ఉన్న రెండు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన తల్లికి తెలిసిన ప్రపంచానికి అవతలి వైపు ఎలా ఉందో చూపించానని చెప్పాడు. తాను పనిచేస్తున్న చోట ఎలా ఉంటుందో అమ్మకు తెలియాలనే సింగపూర్‌కు తీసుకొచ్చానంటూ రాసుకొచ్చారు.
Dattatraya J ఈ పోస్ట్‌ను లింక్డ్‌ఇన్‌లో భాగస్వామ్యం చేసారు. అతని ఈ పోస్ట్‌ను మూడు లక్షల మందికి పైగా లైక్ చేశారు. పోస్ట్‌పై చాలా కామెంట్లు కూడా వచ్చాయి. ఒక వినియోగదారు అద్భుతం.. ఇది నిజంగా అద్భుతం అని వ్రాశాడు. మరొక వినియోగదారు..ప్రియమైన సోదరా, మీరు ఎవరో నాకు తెలియదు? కానీ నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. నీకు అభినందనలు, శుభాకాంక్షలు..! అంటూ ప్రశంసల కామెంట్లు కుమ్మరించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..