Weight Loss: ఊబకాయం సమస్యకు రామబాణం లాంటి చిట్కా.. ఉల్లిపాయలతో ఇలా చేస్తే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..

ఉల్లిపాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది అనేక వ్యాధులను నయం చేయడానికి పనిచేస్తుంది. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు

Weight Loss: ఊబకాయం సమస్యకు రామబాణం లాంటి చిట్కా.. ఉల్లిపాయలతో ఇలా చేస్తే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..
Onion Juice For Weight Loss
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 30, 2023 | 10:00 AM

ఉల్లిపాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది అనేక వ్యాధులను నయం చేయడానికి పనిచేస్తుంది. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు.. అయితే, ఉల్లిపాయ రసంలో ఉండే గుణాలు బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఉల్లిపాయ రసంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, అనేక ఖనిజాలు దాగున్నాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్ శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా బరువును తగ్గిస్తుంది. ఉల్లిపాయలు తీసుకోవడం ద్వారా స్థూలకాయం తొలగిపోతుంది. బరువు తగ్గడానికి మనం ఉల్లిపాయలను అనేక రకాలుగా తీసుకోవచ్చు. బరువు తగ్గడానికి ఉల్లిపాయను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లిపాయ జ్యూస్: ఉల్లిపాయ రసం బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మీరు బరువు తగ్గడానికి ఇతర జ్యూస్‌ల మాదిరిగానే ఉల్లిపాయ రసాన్ని కూడా తాగవచ్చు. ఉల్లిపాయను మిక్సీలో గ్రైండ్ చేసి జ్యూస్‌గా చేసి అందులో ఉప్పు, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా రోజు తింటే కొవ్వు వేగంగా కరిగిపోతుంది.

ఉల్లిపాయ సూప్: బరువు తగ్గడానికి, మీరు ఉల్లిపాయ సూప్ తయారు చేసుకోని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి, ఆపై నీటిలో వేసి ఉడకబెట్టండి. వాటిని బాగా మరగనివ్వాలి. కావాలనుకుంటే, సూప్‌లో కొన్ని ఇతర కూరగాయలను కూడా జోడించవచ్చు. సూప్‌ని బాగా ఉడకబెట్టి దానికి నల్ల ఉప్పు వేసి తాగాలి. ఇంకా నిమ్మరసం కూడా జోడించవచ్చు. ఈ రెసిపీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఉల్లిపాయ సలాడ్: చాలా మంది ప్రజలు సలాడ్‌లో ఉల్లిపాయలను ఉపయోగిస్తారు. రోజూ ఉల్లిపాయలు తింటే.. బరువు సులభంగా తగ్గవచ్చు.. పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కూడా బరువు తగ్గుతారు. మీరు ప్రతిరోజూ మీ ఆహారంతో పాటు ఉల్లిపాయను సలాడ్‌గా తింటే.. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..