AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smoking Effects: ఎక్కువగా సిగరెట్లు కాల్చుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్

చిన్న వయస్సు నుంచి సిగరెట్ల కాల్చే వారికి కొన్ని నివేదికలు షాక్ ఇస్తున్నాయి. ఎక్కువగా సిగరెట్లు కాల్చేవారిలో మధుమేహం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణుల పేర్కొంటున్నారు.

Smoking Effects: ఎక్కువగా సిగరెట్లు కాల్చుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్
Smoking
Nikhil
|

Updated on: Jan 31, 2023 | 1:49 PM

Share

ధూమపానం ఆరోగ్యానికి హానీకరమంటూ ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు ఇచ్చినా కొంతమంది మాత్రం దూమపానాన్ని మానడం లేదు. ముఖ్యంగా యువత ఫ్యాషన్ కోసం అంటూ మొదట్లో సిగరెట్లు కాల్చడం మొదలుపెడుతున్నారు. క్రమేపి అది వ్యసనంగా మారుతుంది. అయితే చిన్న వయస్సు నుంచి సిగరెట్ల కాల్చే వారికి కొన్ని నివేదికలు షాక్ ఇస్తున్నాయి. ఎక్కువగా సిగరెట్లు కాల్చేవారిలో మధుమేహం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణుల పేర్కొంటున్నారు. ముఖ్యంగా సిగరెట్లలో టుబాకో అంటే పొగాకు మొక్క ఆకులను ప్రాసెస్ చేసి సిగరెట్లుగా చేస్తారు. సిగరెట్లల్లో నికోటిన్ అనే రసాయనం ఉంటుంది. దీని వల్ల సిగరెట్లకు బాగా అలవాటుపడతారు. అలాగే శరీరంపై కూడా చెడు ప్రభావం చూపిస్తుంది. ప్రాణాంతక సమస్యలకు కూడా ప్రధాన కారణంగా నిలుస్తుంది. 

ధూమపానం వల్ల మధుమేహ సమస్యలకు గురవడమే కాకుండా మరికొన్ని ప్రాణాంతక సమస్యలతో కూడా బాధపడాల్సి వస్తుంది. శ్వాసకోశ వ్యవస్థ, రక్త ప్రసరణ, చర్మం, కంటి సంబంధిత సమస్యలు వేధిస్తాయి. మధుమేహం ఎక్కువగా ఉండి ధూమపానం దానికి తోడైతే చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్లకు ప్రత్యామ్నాయంగా సిగార్లు, హుక్కా వంటివి కొందరు ఇష్టపడుతుంటారు. ఇలాంటి వాటి కారణంగా సమస్యలు మరింత జఠిలంగా మారతాయని పేర్కొంటున్నారు. ధూమపానంతో ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్య వస్తుంది. దీని కారణంగా అబ్స్ స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్ పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధూమపానం వల్ల రక్త నాళాలు దెబ్బతిని రక్తకణాలకు ఇబ్బందయ్యే అవకాశం ఉంది. దీంతో అథెరెస్కోలోరిసిస్ తో బాధపడాల్సి వస్తుంది. ధూమపానం శరీరంలో రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తుందని నిపుణుల చెబుతున్నారు. 

ముఖ్యంగా స్త్రీలు ధూమ పానం చేస్తే పునరుత్పత్తి వ్యవస్థ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. దీని కారణంగా పిల్లలు పుట్టడంలో సమస్యలు, గర్భాశయ సమస్యలు అధికమవుతాయి. పొగాకు శరీరంలోని హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. ధూమపానం ఆఖరి దశ క్యాన్సర్. ముఖ్యంగా ధూమపానం ఎక్కువగా చేసే వారు ఊపిరితిత్తుల క్యాన్సర్ తో పాటు ఇతర క్యాన్సర్లకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవన విధానం కలిగి ఉండాలంటే కచ్చితంగా ధూమపానానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..