AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు స్మోకింగ్ అలవాటు ఉందా.. పొగాకు నములుతారా.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు

పొగ తాగడం ఎంత హానికరమో మనకు తెలిసిందే. ధూమపానాన్ని నిషేధించాలంటూ ప్రభుత్వం వివిధ రూపాల్లో ప్రకటనలు, అవగాహన చేస్తున్నా సమాజంలో మార్పు రావడం లేదు. అందుకే పొగ తాగితే వచ్చే నష్టాలను వివరిస్తూ...

మీకు స్మోకింగ్ అలవాటు ఉందా.. పొగాకు నములుతారా.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు
No Smoking
Ganesh Mudavath
|

Updated on: Mar 09, 2022 | 10:06 AM

Share

పొగ తాగడం ఎంత హానికరమో మనకు తెలిసిందే. ధూమపానాన్ని నిషేధించాలంటూ ప్రభుత్వం వివిధ రూపాల్లో ప్రకటనలు, అవగాహన చేస్తున్నా సమాజంలో మార్పు రావడం లేదు. అందుకే పొగ తాగితే వచ్చే నష్టాలను వివరిస్తూ ఏటా మార్చి(March) రెండో బుధవారాన్ని నో స్మోకింగ్ డే (No Smoking Day) గా జరుపుకుంటున్నారు. ధూమపానం చేసేవారిలో అవగాహన తీసుకువచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తాయి. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం సిగరెట్ , పొగాకు వల్ల శరీరానికి కలిగే హానిని తెలియజేయడం.. ఆరోగ్య ప్రభావాల గురించి అవగాహన కల్పించడం. మొట్టమొదటి నో స్మోకింగ్ డేను 1984 లో జరిపారు. ఇక ధూమపానం వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ.. ప్రతి ఏడాది ఒక థీమ్ ని చిన్న పదబంధం రూపంలో ప్రచారం చేస్తారు.

ధూమపానం వల్ల ప్రపంచంలో ఏడాదికి 70 లక్షల మందికి పైగా చనిపోతున్నాయని ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2030 నాటికి ఆ సంఖ్య 80 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ జనాభాలో కేవలం 20 శాతం మంది మాత్రమే ధూమపానానికి సంబంధించిన చట్టాల ద్వారా అవగాహన కలిగి ఉన్నారు. ధూమపానం ఇచ్చే కిక్కు కోసం చూసుకుంటే మగవారిలో లైంగిక పటుత్వం తగ్గిపోతుంది. శరీరంలోని రక్త నాళాలు సంకోచించేలా చేస్తుంది. సిగరెట్ తాగే మహిళల్లో అధికంగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. ధూమపానం అధికంగా చేసేవారిలో దంతాల పనితీరు దెబ్బతింటుంది. త్వరగా రాలిపోతాయి. పొగాకు వల్ల నిమోనియా, ఎంఫిసెమా, తీవ్ర బ్రాంకైటిస్ వంటి ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నాయి.

ఒక్క చైనాలోనే 300 మిలియన్ల మంది ధూమపానం చేస్తున్నారు. వారు ఏడాదిలో దాదాపు 1.7 ట్రిలియన్ సిగరెట్లను కాలుస్తున్నారు. అంటే నిమిషానికి దాదాపు మూడు మిలియన్ సిగరెట్లను వినియోగిస్తున్నారు. మనదేశంలో దాదాపు 120 మిలియన్ల మంది పొగాకును ఆస్వాదిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విధంగా ప్రపంచంలో ఉన్న స్మోకర్లలో 12 శాతం మంది భారత్ లోనే ఉన్నారు.

Also Read

ICAR-CMFRI Jobs: పదో తరగతి అర్హతతో.. ఐకార్‌-సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు..

AP Crime: బృందాలుగా ఏర్పడి దర్యాప్తు.. చెడ్డీ గ్యాంగ్ లోని ఓ సభ్యుడు అరెస్టు

Zodiac Signs: మార్చిలో ఈ 4 రాశుల వారి జీవితాల్లో చాలా మార్పులు.. కనకవర్షం కురుస్తుంది..!