Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime: బృందాలుగా ఏర్పడి దర్యాప్తు.. చెడ్డీ గ్యాంగ్ లోని ఓ సభ్యుడు అరెస్టు

విజయవాడ(Vijayawada) శివార్లలో చోరీకి పాల్పడుతున్న చెడ్డీ గ్యాంగ్ ముఠాలోని ఓ సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. సీపీ ఆదేశాలతో బృందాలుగా ఏర్పడి...

AP Crime: బృందాలుగా ఏర్పడి దర్యాప్తు.. చెడ్డీ గ్యాంగ్ లోని ఓ సభ్యుడు అరెస్టు
Arrest Hyderabad
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 09, 2022 | 9:03 AM

విజయవాడ(Vijayawada) శివార్లలో చోరీకి పాల్పడుతున్న చెడ్డీ గ్యాంగ్ ముఠాలోని ఓ సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. సీపీ ఆదేశాలతో బృందాలుగా ఏర్పడి ఒకరిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. గుజరాత్‌(Gujarath), మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) రాష్ట్రాలకు చెందిన చెడ్డీగ్యాంగ్‌ సభ్యులు.. రెండు ముఠాలుగా ఏర్పడి విజయవాడ నగరంలో నేరాలకు పాల్పడేవారు. గతేడాది డిసెంబరు 2న తాడేపల్లిలో, డిసెంబరు 6న పోరంకి, వైఎస్సార్‌ కాలనీ సమీపంలో చోరీలు జరిగాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెడ్డిగ్యాంగ్‌లో నిందితుడిగా ఉన్న గుజరాత్‌ రాష్ట్రం దాహూద్‌ జిల్లా గుల్భర్‌కు చెందిన ఖాజూభాయ్‌ మాలాభాయ్‌ మంధోడ్‌ ను అరెస్టు చేశారు. ఇటీవల గుజరాత్‌లో ఎన్నికల అనంతరం జరిగిన జంటహత్యల్లోనూ ఈ ముఠా నాయకుడి సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. చెడ్డీ గ్యాంగ్ ముఠా తిరుపతిలో కూడా దోపిడీకి పాల్పడినట్లు వివరించారు. పోలీసు బృందం విచారణలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. విజయవాడ పోలీస్ కమిషనర్‌ కాంతిరాణా ఆదేశాల మేరకు సీసీఎస్‌ పోలీసుల బృందంగా ఏర్పడ్డాయి. ఏసీపీ చలసాని శ్రీనివాసరావు నేతృత్వంలో గుజరాత్‌ వెళ్లి విచారణ జరిపాయి.

గుల్భర్‌ గ్రామానికి చెందిన సక్రా మంధోడ్‌, మడియా కాంజీ మేడా, మధ్యప్రదేశ్‌కు చెందిన కమలేష్‌ బబేరియాలను డిసెంబరు 17న అరెస్టు చేశారు. పెనమలూరు మండలం పోరంకిలో చోరీకి పాల్పడి అరెస్టయిన వీరిని బెయిల్‌పై విడిపించేందుకు ఖాజూభాయ్‌ మాలాభాయ్‌ మంధోడ్‌ న్యాయవాదిని సంప్రదించేందుకు మంగళవారం నగరానికి వచ్చాడు. వారి ఫోను సంభాషణలపై నిఘా ఉంచటంతో సీసీఎస్‌ పోలీసుల అప్రమత్తమయ్యారు. అతడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ రెండు నేరాల్లో మరో ఆరుగురు సభ్యులను అరెస్టు చేయాల్సి ఉంది.

Also Read

Digital India Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! డిజిటల్‌ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పూర్తివివరాలివే!

Viral Video: డ్సాన్స్‌తో దుమ్ములేపిన వధువు.. కరెన్సీ నోట్ల వర్షం..! నెట్టింట షేక్ చేస్తున్న వైరల్ వీడియో…

Indian Army OTA Jobs: రాతపరీక్షలేకుండానే.. బీటెక్‌/డిగ్రీ అర్హతతో ఇండియన్‌ ఆర్మీలో 191 ఉద్యోగాలు..అవివాహితులు..