- Telugu News Photo Gallery Weight Loss Tips In Telugu Brown Rice or Red Rice! What do you eat at noon to lose weight?
Weight Loss Tips: బరువు తగ్గాలంటే బ్రౌన్ రైస్ తినాలా? రెడ్‌రైస్ తినాలా? వీటిల్లో ఏ బియ్యం మంచిది..
మధుమేహం (షుగర్ వ్యాధి) మాదిరిగానే ఊబకాయం సమస్యకూడా ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటోంది. లాక్‌డౌన్‌లో ఈ సమస్య మరింత పెరిగింది. బరువు తగ్గి, ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ఐతే బరువు తగ్గడం వల్ల అలసట, నీరసం కూడా వెన్నంటే ఉంటాయి...
Updated on: Mar 09, 2022 | 11:44 AM

obesity problem increased a lot more in lockdown: మధుమేహం (షుగర్ వ్యాధి) మాదిరిగానే ఊబకాయం సమస్యకూడా ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటోంది. లాక్‌డౌన్‌లో ఈ సమస్య మరింత పెరిగింది. బరువు తగ్గి, ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ఐతే బరువు తగ్గడం వల్ల అలసట, నీరసం కూడా వెన్నంటే ఉంటాయి. చేసేది లేక అన్నం తినాలనుకుంటే, మళ్లీ ఎక్కడ బరువు పెరుగుతామేమోననే భయం చాలా మందికి ఉంటుంది. అందుకు పరిష్కారంగా ఆరోగ్య నిపుణులు బ్రౌన్ రైస్, మరికొందరు రెడ్ రైస్ సూచిస్తుంటారు. ఐతే వీటిల్లో ఏది తినాలో తెలియక తికమకపడిపోతుంటారు.

బ్రౌన్ రైస్ అనేది తృణధాన్యం. ఈ రకమైన బియ్యంలో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుందని ఢిల్లీకి చెందిన పోషకాహార నిపుణురాలు పరుల్ మల్హోత్రా సూచిస్తున్నారు.

దీంతో బ్రౌన్ రైస్‌కు డిమాండ్ పెరగడంతో మార్కెట్‌లో రకరకాల బియ్యాలు ప్రత్యక్షమవుతున్నాయి. కొంతమందైతే బియ్యినికి రంగులు కలిపి అమ్మడం మొదలుపెట్టారు. అందుకే కొనేముందు ఓసారి పరిశీలించి కొనడం బెటర్!

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆంథోసైనిన్‌ల కంటెంట్ కూడా బ్రౌన్ రైస్‌లో ఎక్కువగా ఉంటుంది. ఎరుపు, నలుపు, పర్పుల్ కలర్లలో ఉండే బియ్యంలో ఆంథోసైనిన్ పరిమాణం అధికంగా ఉంటుంది.

ఎర్ర బియ్యంలో మాంగనీస్ పరిమాణం ఎక్కువ. ఇది ఎముకలను నిర్మాణంలో సహాయపడుతుంది. ఇది రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. ఈ బియ్యం కొవ్వులు, మెటబాలిజమ్, కార్బోహైడ్రేట్ల శోషణ, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దోహదపడుతుంది.

రెడ్ రైస్, బ్రౌన్ రైస్ రెండూ కూడా బరువు తగ్గడానికి దోహదపడేవే. రెడ్ రైస్ లో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు కూడా అధికంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ బియంతో వండిన అన్నం నిరభ్యంతరంగా తినొచ్చు.




