Zodiac Signs: మార్చిలో ఈ 4 రాశుల వారి జీవితాల్లో చాలా మార్పులు.. కనకవర్షం కురుస్తుంది..!

Zodiac Signs: గ్రహాల మార్పు విషయంలో మార్చి నెలకు చాలా ప్రత్యేకత ఉంది. 3 ముఖ్యమైన గ్రహాలలో మార్పులు జరుగుతున్నాయి. ఇది మొత్తం 12 రాశుల ప్రజలపై జీవితాలపై

Zodiac Signs: మార్చిలో ఈ 4 రాశుల వారి జీవితాల్లో చాలా మార్పులు.. కనకవర్షం కురుస్తుంది..!
Zodiac Signs
Follow us
uppula Raju

|

Updated on: Mar 09, 2022 | 8:23 AM

Zodiac Signs: గ్రహాల మార్పు విషయంలో మార్చి నెలకు చాలా ప్రత్యేకత ఉంది. 3 ముఖ్యమైన గ్రహాలలో మార్పులు జరుగుతున్నాయి. ఇది మొత్తం 12 రాశుల ప్రజలపై జీవితాలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. మార్చి ప్రారంభంలో బుధ గ్రహం కుంభరాశిలోకి ప్రవేశించింది. మార్చి 15న సూర్యుడు కుంభరాశిని వదిలి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. తరువాత శుక్ర గ్రహం ఈ నెల చివరి రోజున కుంభరాశిలోకి సంచరిస్తుంది. గ్రహాలలో జరిగే ఈ ప్రధాన మార్పులు 4 రాశుల వారికి బలమైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఆ రాశుల గురించి తెలుసుకుందాం. అందులో మొదటి రాశి మేషరాశి. మార్చిలో జరిగే ఈ గ్రహ మార్పులు మేషరాశివారికి శుభాన్ని కలిగిస్తాయి. వారి ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. ఉద్యోగం-వ్యాపారం రెండింటికీ ఇది మంచి సమయం. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు పెద్ద ఒప్పందాలు ఉండవచ్చు. ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటుంది.

వృషభం: 31 మార్చి 2022 వరకు ఉన్న సమయం వృషభ రాశి వారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది. మీరు పెద్ద ఇంక్రిమెంట్ పొందవచ్చు లేదా కొత్త జాబ్ ఆఫర్ రావొచ్చు. ఈ ఆఫర్ భారీ ప్యాకేజీతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా కుటుంబంలో కూడా సంతోషం ఉంటుంది. ఈ సమయంలో ఏ పెద్ద పనినైనా పూర్తి చేయవచ్చు.

మిథునం: ఈ సమయం మిథున రాశి వారికి కెరీర్‌లో గొప్ప విజయాన్ని అందిస్తుంది. పని విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటారు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కార్యాలయంలో గౌరవం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది.

మకరం: మకరరాశి వారి జాతకంలో గ్రహాల స్థానం రాజయోగాన్ని కలిగిస్తోంది. ఈ రాజయోగం గొప్ప విజయాన్ని తెచ్చిపెడుతుంది. చాలా డబ్బు సంపాదిస్తారు. ముఖ్యంగా వ్యాపారవేత్తలు, మార్కెటింగ్ వ్యక్తులకు మార్చి 31 వరకు సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జ్యోతిష్యంపై ఆధారపడి ఉంటుంది. కేవలం ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే రాయడం జరిగింది.

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయి చెల్లించండి.. స్కూటీని ఇంటికి తీసుకెళ్లండి..!

Cricketers: పెళ్లికాకముందే ఈ ఐదుగురు స్టార్‌ క్రికెటర్లు తండ్రులయ్యారు..!

RCB కొత్త కెప్టెన్‌ ఎవరు..? అందరు అనుకున్నట్లు అతడేనా.. నేడు అధికారికంగా వెల్లడించే అవకాశం..