Cricketers: పెళ్లికాకముందే ఈ ఐదుగురు స్టార్‌ క్రికెటర్లు తండ్రులయ్యారు..!

Cricketers: ప్రేమలో పడి పెళ్లికి ముందే తండ్రి అయిన క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. ఇందులో ఓ ఇండియన్ క్రికెటర్ కూడా ఉన్నాడు. అతడి పేరు హార్దిక్ పాండ్యా. ఈ ఇండియన్‌

Cricketers: పెళ్లికాకముందే ఈ ఐదుగురు స్టార్‌ క్రికెటర్లు తండ్రులయ్యారు..!
Hardik Pandya
Follow us
uppula Raju

|

Updated on: Mar 09, 2022 | 7:27 AM

Cricketers: ప్రేమలో పడి పెళ్లికి ముందే తండ్రి అయిన క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. ఇందులో ఓ ఇండియన్ క్రికెటర్ కూడా ఉన్నాడు. అతడి పేరు హార్దిక్ పాండ్యా. ఈ ఇండియన్‌ క్రికెటర్ పెళ్లికి ముందే తండ్రి అయ్యాడు. పాండ్యా బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్‌ జనవరి 1, 2020న దుబాయ్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. 30 జూలై 2020న హార్దిక్ పాండ్యా తన స్నేహితురాలు గర్భవతి అని తాను తండ్రి కాబోతున్నట్లు వెల్లడించాడు. హార్దిక్ పాండ్యా తన బిడ్డకు ‘అగస్త్య’ అని పేరు కూడా పెట్టడం విశేషం. ఈ లిస్టులోకి ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కూడా చేరాడు. రూట్ కూడా పెళ్లి చేసుకోకుండానే తండ్రి అయ్యాడు. 2014 నుంచి తన స్నేహితురాలు క్యారీ కోర్టెల్‌తో డేటింగ్ చేస్తున్నాడు. వీరిద్దరూ మార్చి 2016లో నిశ్చితార్థం చేసుకున్నారు. T20 ప్రపంచకప్‌కి ముందు జో రూట్ పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడు. జో రూట్ కుమారుడు ఆల్ఫ్రెడ్ 7 జనవరి 2017న జన్మించాడు. దీని తర్వాత ఈ జంట పెళ్లి చేసుకోవడం విశేషం.

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా పెళ్లి చేసుకోకుండానే తండ్రి అయ్యాడు. 2014లో డేవిడ్ వార్నర్ గర్ల్ ఫ్రెండ్ క్యాండీస్ తన మొదటి కుమార్తెకు జన్మనిచ్చింది. 2015లో డేవిడ్ వార్నర్ క్యాండీస్‌ని పెళ్లాడాడు. వార్నర్‌కు ముగ్గురు కుమార్తెలు ఐవీ, ఇండీ, ఇస్లా ఉన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధాని, ఒకప్పటి క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కూడా పెళ్లి చేసుకోకుండానే తండ్రి అయ్యాడు. ఇమ్రాన్‌కి సీత వైట్ల బంధువు. 1987-88లో ప్రారంభమైన సీత, ఇమ్రాన్‌ల బంధం 1991లో మరీ దగ్గరైంది.1992లో వీరికి ఒక బిడ్డ జన్మంచాడు. అది ఇమ్రాన్‌ బిడ్డ అని అయితే తొలుత డీఎన్‌ఏ పరీక్షల్లో ఈ విషయాన్ని ఇమ్రాన్‌ ఖండించాడు.

1980లో భారత్‌కు వచ్చిన రిచర్డ్స్ ప్రముఖ నటి నీనా గుప్తాను కలిశారు. ఇద్దరి మధ్యా ఎఫైర్ చాలా కాలం కొనసాగింది. 1989లో నీనా ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమె పేరు మసాబా. కానీ వివియన్ రిచర్డ్స్ మేరీని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి చేసుకోకుండానే తండ్రి అయిన లిస్ట్‌లో డేంజర్‌ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ కూడా ఉన్నాడు. 2017లో ఐపీఎల్ జరుగుతున్నప్పుడు అతని స్నేహితురాలు నటాషా బారిడ్జ్ ఒక కుమార్తెకు జన్మనిచ్చింది.

Health Tips: ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? అయితే జాగ్రత్త.. ప్రమాదం పొంచి ఉన్నట్లే..!

Asthma: మీరు అస్తమాతో ఇబ్బంది పడుతుంటే ఈ విషయాలను తప్పుకుండా గుర్తుంచుకోండి..

Vegetables Benefits: ఈ కూరగాయలతో అద్భుతమైన ప్రయోజనం.. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కీలక పాత్ర