Rohith Sharma: కెప్టెన్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు.. బీసీసీఐ స్పెషల్ వీడియోలో రోహిత్ శర్మ..
టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ(Rohith Sharma) సాధించిన తొలి విజయాన్ని అభినందిస్తూ బీసీసీఐ(BCCI) సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ(Rohith Sharma) సాధించిన తొలి విజయాన్ని అభినందిస్తూ బీసీసీఐ(BCCI) సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఈ అద్భుత విజయానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక సన్నివేశాలతోపాటు కెప్టెన్ రోహిత్ శర్మ మాటలు కూడా జోడించింది. తాను భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా అవుతానని ఎప్పుడూ అనుకోలేదని రోహిత్ చెప్పుకొచ్చాడు. ‘ నేను కెప్టెన్ కావడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. నిజం చెప్పాలంటే, ఇది నేను ఎప్పుడూ ఆలోచించని విషయం. జాతీయ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది.’ అని రోహిత్ శర్మ అన్నాడు. దీంతో పాటు విరాట్(Virat Kohli) 100వ టెస్టు గురించి కూడా రోహిత్ ప్రస్తావించా
డు. ‘ఇది చాలా ప్రత్యేకమైన సందర్భం. ప్రతి ఆటగాడు 100 టెస్టులు ఆడాలని కోరుకుంటాడు. విరాట్ ఈ ఘనత సాధించాడు. అది అతనికి ఎప్పటికీ చిరస్మరణీయం.’ అని చెప్పాడు. మొహాలీ టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు రోహిత్.. విరాట్ కోహ్లీకి ‘గార్డ్ ఆఫ్ హానర్’ ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో కోహ్లీ అప్పటికే మైదానానికి చేరుకున్నాడు, అటువంటి పరిస్థితిలో రోహిత్ అతన్ని మళ్లీ బౌండరీ వెలుపలకు పంపాడు. ఆపై ఆటగాళ్లందరూ విరాట్‌కు ‘గార్డ్ ఆఫ్ హానర్’ ఇచ్చారు.
రోహిత్ శర్మ పూర్తి కెప్టెన్‌గా మారడానికి ముందు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీలో అనేక సందర్భాల్లో T20, ODI జట్లకు నాయకత్వం వహించినప్పటికీ, అతనికి టెస్ట్ మ్యాచ్‌కు కెప్టెన్‌గా అవకాశం రాలేదు. మొహాలీ టెస్టులో తొలిసారి టెస్టు జట్టు బాధ్యతలు చేపట్టాడు రోహిత్. కెప్టెన్‌గా తొలి టెస్టులోనే చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. ఈ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.
A perfect beginning to his Test captaincy ??
We take a look at the series of events when @ImRo45 led #TeamIndia in whites at Mohali for the first time. ? ? #INDvSL | @Paytm
Watch this special feature ?️ ?https://t.co/C3A0kZExWC pic.twitter.com/XxF19t6GsI
— BCCI (@BCCI) March 8, 2022
Read Also.. Virat Kohli: అక్కడి నుంచి విరాట్ కోహ్లీకి సందేశం పంపిన అభిమాని.. పాకిస్థాన్‌లో 71వ సెంచరీ చేయాలంటూ వినతి..