పొగరాయుళ్లకు షాకింగ్ న్యూస్.. స్మోకింగ్ చేస్తే ఆ నష్టం కూడా.. పరిశోధనలో తేలిన కొత్త విషయం
స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం పడుతుంది, శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయి, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పటి వరకు మనకు తెలిసినవి ఇవే అయితే తాజా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం పడుతుంది, శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయి, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పటి వరకు మనకు తెలిసినవి ఇవే అయితే తాజా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పొగతాగడం ఎముకల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని పరిశోధనల్లో తేలింది. యూనివర్సిటీ ఆఫ్ నెవెడా, లాస్‌వెగాస్‌కు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీర్ఘకాలంగా స్మోకింగ్ అలవాటు ఉన్న వారిలో ఎముకలు గుల్లబారటం, విరిగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ధూమపానం చేసే వారిలో ఎముకలు బలహీనంగా మారే అవకాశాలు 37 శాతం ఎక్కువని పరిశోధనల్లో తేలింది. మణికట్టు, కాళ్లు, వెన్నెముక, భుజాలు లాంటి భాగాలకు ముప్పు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఎముకలు విరిగిన వారిలో 21 నుంచి 37 శాతం మంది ఏడాదిలోపే మరణించినట్లు పరిశోధనల్లో తేలింది. టొబాకోలోని కొన్ని రసాయనాలు ఎముకల కణాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, విటమిన్ డీ శరీరానికి అందకుండా చూస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మద్యం మత్తులో వరుడు చేసిన పనికి అంతా షాక్.. వధువుతో చేయాల్సింది.. పక్క అమ్మాయితో !!
Cricket: పొట్టకూటి కోసం చెప్పులు అమ్ముతోన్న ఐసీసీ మాజీ అంపైర్
పూజ ధ్యాసలో పడి కృష్ణుడి విగ్రహం మింగిని వ్యక్తి !! చివరికి ఏమైందంటే ??
బుల్డోజర్‌పై మంటపానికి వరుడు.. డ్రైవర్‌కు భారీ జరిమానా
Samsung: సామ్‌సంగ్‌కు రూ. 75 కోట్ల జరిమానా.. ఎందుకంటే ??