Sleeping Tips: పడుకునే ముందు వీటిని అస్సలు తినొద్దు.. లేదంటే మీకు జాగారాలే..!

Sleeping Tips: ఆరోగ్యకరమైన శరీరం, మనస్సు కోసం మంచి నిద్ర చాలా ముఖ్యం. ఇదే విషయాన్ని అనేక ఆరోగ్య నివేదికలు, ఆరోగ్య నిపుణులు

Sleeping Tips: పడుకునే ముందు వీటిని అస్సలు తినొద్దు.. లేదంటే మీకు జాగారాలే..!
Sleeping Tips
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 28, 2022 | 10:44 AM

Sleeping Tips: ఆరోగ్యకరమైన శరీరం, మనస్సు కోసం మంచి నిద్ర చాలా ముఖ్యం. ఇదే విషయాన్ని అనేక ఆరోగ్య నివేదికలు, ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారు. రాత్రి సరిగా నిద్రపోకపోతే.. దాని ఎఫెక్ట్ మరుసరిటి రోజంతా చూపుతుంది. బద్ధకం, అలసట, చిరాకుతో రోజంతా గడిచిపోతుంది. అంతేకాదు.. దాని ప్రభావం మనసుపైనా పడుతుంది. ఏ పని కూడా మనస్ఫూ్ర్తిగా చేయలేకపోతారు. అయితే, రాత్రి నిద్ర లేక పట్టక చాలా మంది అవస్థలు పడుతుంటారు. నిద్ర పట్టకపోవడానికి కారణం రాత్రి పడుకునే ముందు మనం తినే ఆహారం కూడా అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఆహార పదార్థాలు తినడం వల్ల నిద్రకు భంగం వాటిల్లుతందని చెబుతున్నారు. మరి నిద్రను పాడు చేసే ఆ ఆహారాలేంటి? రాత్రి సమయంలో ఏం తినకూడదు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

చికెన్.. చికెన్ అంటే ఎంత ఇష్టమున్నప్పటికీ.. రాత్రి పూట చికెన్ తినడం మానేయాలి. ఇది ఆరోగ్యానికి చాలా ఉత్తమం. చికెట్‌లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు.. ఇది జీర్ణం అవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. రాత్రి పడుకునే ముందు చికెన్ తింటే.. అది జీర్ణం అవడానికి సమయం తీసుకుంటుంది. అది జీర్ణం అవడం, ప్రోటీన్స్ శరీరానికి అందించడం ఆలస్య అవడం కారణంగా.. నిద్రకు భంగం కలుగుతుంది. అలాగే, కడుపులో భారంగా ఉండి కూడా నిద్ర పట్టదు గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి.

చాక్లెట్.. కొన్నిసార్లు రాత్రి సమయంలో తీపి పదార్థాలు తింటాం. కొంతమంది రాత్రి పడుకునే ముందు చాక్లెట్స్ తింటారు. ఈ చాక్లెట్లలో కెఫిన్, టైరోసిన్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి నిద్రను చెడగొడతాయి. మెదడును మేల్కొని ఉండేలా ప్రభావితం చేస్తాయి. తద్వారా నిద్రపట్టదు.

ఇవి కూడా చదవండి

మద్యం.. రాత్రి సమయంలో మద్యం తాగితే నిద్రపై ప్రభావం చూపుతుంది. ఆల్కాహాల్ మీ నిద్ర పాడు చేయడమే కాకుండా.. మీ ఆరోగ్యాన్ని కూడా పాలు చేస్తుంది. ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల వ్యక్తి బరువు పెరుగుతంది. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అదికాస్తా డయాబెటిస్‌కు దారి తీస్తుంది.

టీ, కాఫీ.. టీ, కాఫీ రెండింటిలో కెఫిన్ ఉంటుంది. ఇది ఏ రూపంలో తీసుకున్నా.. అవసరమైన శక్తిని అందిస్తుంది. అయితే, రాత్రి నిద్రపోయే సమయంలో వీటిని తీసుకోవడం వల్ల మీ నిద్రకు భంగం కలుగుతుంది. ఇందులోని కెఫిన్ మీ నిద్రను పాడు చేస్తుంది. అందుకే రాత్రి సమయంలో టీ, కాఫీ తీసుకోకూడదు.