Brinjal Side Effects: బీ అలర్ట్.. ఈ 5 వ్యాధులతో బాధపడేవారు పొరపాటున కూడా వంకాయ కూర తినొద్దు..
వంకాయ ఇష్టపడని వారు చాలా అరుదు. వంకాయతో చేసిన వంటకాలను లొట్టలేసుకుంటూ మరీ తినేస్తారు జనాలు. వంకాయతో రకరకాల వంటకాలు తయారు చేయొచ్చు.
వంకాయ ఇష్టపడని వారు చాలా అరుదు. వంకాయతో చేసిన వంటకాలను లొట్టలేసుకుంటూ మరీ తినేస్తారు జనాలు. వంకాయతో రకరకాల వంటకాలు తయారు చేయొచ్చు. దీని స్పెషాలిటీ ఏంటంటే.. ప్రతీ సీజన్‌లో, అతి తక్కువ ధరకే లభిస్తుంది. చలికాలంలో వంకాయ కూర తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలంలో దీనిని తింటే.. బరువు తగ్గుతారు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బులు కూడా నియంత్రణలో ఉంటాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వంకయాను అందరూ తినలేని పరిస్థితి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం.. 5 రకాల సమస్యలతో బాధపడేవారు పొరపాటున కూడా వంకాయను తినకూడదు. వాటిని తినడం వల్ల సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. మరి ఎవరు వంకాయను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
రాళ్ల సమస్యతో బాధపడేవారు..
కిడ్నీ స్టోన్స్‌తో బాధపడేవారు పొరపాటున కూడా వంకాయ తినకూడదు. వంకాయలో ఆక్సలేట్ అనే మూలకం ఉంటుంది. దీనిని తినడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. ఈ సమస్యతో బాధపడేవారు వంకాయకు దూరంగా ఉంటేనే మంచిది.
రక్తహీనత..
శరీరంలో ఐరన్ లోపం ఉన్నవారు వంకాయను తినకూడదు. దీనిని తినడం వల్ల ఐరన్ లోపం మరింత పెరుగుతుంది. దీని వల్ల సమస్య తగ్గడానికి బదులుగా పెరుగుతుంది.
అలెర్జీలు..
ఎలాంటి అలర్జీతో బాధపడుతున్న వారైనా.. వంకాయకు దూరంగా ఉండాలి. వంకాయలో అలెర్జీని పెంచే మూలకాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే దీనిని తినడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. అందుకు చర్మం, ఇతర అలెర్జీతో బాధపడేవారు వంకాయను తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణవ్యవస్థలో సమస్యలు..
తరచుగా కడుపునొప్పి, గ్యాస్, అసిడిటీ సమస్య ఉన్నవారు వంకాయతో చేసిన వంటకాలకు దూరంగా ఉండాలి. వంకాయ సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. దానిని తినడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది.
కంటి సమస్యలు..
కంటి సమస్యలతో బాధపడేవారు వంకాయను తినొద్దు. దీనిని తినడం వల్ల కళ్లలో మంట, వాపు, చికాకు సమస్య పెరుగుతుంది. ఒక్కోసారి కంటి చూపు కూడా మందగిస్తుంది. అందుకే వంకాయ వాడకాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు నిపుణులు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..