Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwini Vaishnaw: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ సమస్యే ఉండదు.. కేంద్ర మంత్రి ట్వీట్..

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయ రైల్వేను అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే.. ప్రజా రవాణాను మెరుగు పర్చేందుకు, అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తోంది..

Ashwini Vaishnaw: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ సమస్యే ఉండదు.. కేంద్ర మంత్రి ట్వీట్..
Ashwini Vaishnaw
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 01, 2023 | 9:54 PM

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయ రైల్వేను అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే.. ప్రజా రవాణాను మెరుగు పర్చడంతోపాటు.. అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. దీనిలో భాగంగా రైల్వే అభివృద్ధి, స్టేషన్ల ఆధునికీకరణ, రైళ్లలో ఆధునిక సౌకర్యాలు, వసతుల కల్పన చేపట్టింది. దీంతోపాటు లగ్జరీ హైస్పీడ్ ట్రైన్లు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ లను సైతం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో రైళ్లలో పరిశుభ్రత విషయంలో రాజీ పడకుండా అనేక ప్రణాళికలు చేపట్టింది. ట్రైన్లలో సాధారణంగా టాయిలెట్లు మురికికూపాలుగా ఉంటాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు. ముఖ్యంగా ఈ సమస్య గురించే ఎక్కువగా ఫిర్యాదులు అందుతుంటాయి. ఈ క్రమంలో ఇండియన్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. టాయిలెట్లలో అపరిశుభ్రతను దరిచేరనివ్వకుండా ఉండేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

ట్రైన్లలో, టాయిలెట్లలో అపరిశుభ్రత సమస్యను పరిష్కరించేందుకు భారతీయ రైల్వే చర్యలు చేపట్టింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంతో రైళ్లలో కొత్త టాయిలెట్ డిజైన్‌లును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు దృష్టిసారించింది. ఈ క్రమలో రైళ్లలో అప్‌గ్రేడ్ చేసిన మరుగుదొడ్లను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సలహాలు సూచనలిచ్చారు. కొత్త మరుగుదొడ్డిని పరిశీలిస్తున్న వీడియోను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా పోస్ట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మెరుగుపరచిన టాయిలెట్ల సౌకర్యాలను పరిశీలించారు. రైలు లోపల వాష్ బేసిన్, అద్దం, టాయిలెట్ సీట్లు, అలాగే లోపల ఏర్పాటు చేసిన సౌకర్యాలను దీనిలో చూపించారు. అంతకుముందు.. ఇప్పుడు కల్పించనున్న సౌకర్యాలను వివరిస్తూ ఆ వీడియోలో చూపించారు. అంతేకాకుండా ఆధునిక సౌకర్యాల గురించి ఒక అధికారి కేంద్ర మంత్రికి తెలియజేస్తున్న దృశ్యాలను కూడా అందులోనే చూపించారు.

రైలులో కొత్త రెస్ట్‌రూమ్ డిజైన్‌లను ఏర్పాటు చేయడంపై భారతీయ రైల్వేను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. టాయిలెట్ల పరిస్థితి మరి అధ్వానంగా ఉందని.. దీనిపై దృష్టిసారించడం మంచి పరిణామం అంటూ పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, కొత్త డిజైన్లను పరిశీలించి వాటిని మెరుగుపరచాలంటూ పలువురు ట్విట్టర్ వేదికగా మంత్రికి సూచించారు. ఇంకా.. ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచాలని.. పర్యవేక్షణ కూడా ఉంచాలని ట్విట్టర్ వేదికగా నెటిజన్లు రైల్వేను కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..