AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Enterprises: కీలక నిర్ణయం తీసుకున్న అదానీ కంపెనీ.. ఇక వారి డబ్బులు తిరిగి వెనక్కే..

ప్రస్తుత మార్కెట్ అస్థిరమైన పరిస్థితుల నేపథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తన ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ను రద్దు చేసుకుంది. ఈ మేరకు పెట్టుబడిదారులకు వారి పెట్టుబడుల మొత్తాన్ని తిరిగి ఇవ్వనున్నట్లు అదాని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

Adani Enterprises: కీలక నిర్ణయం తీసుకున్న అదానీ కంపెనీ.. ఇక వారి డబ్బులు తిరిగి వెనక్కే..
Gautam Adani
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 01, 2023 | 11:14 PM

Share

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టుపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో రూ.20,000 కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ (FPO)ని రద్దు చేసినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. తమ పెట్టుబడిదారుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ చైర్మన్ గౌతమ్ అదానీ మాట్లాడుతూ ‘మా ఎఫ్‌పీఓకు మీ మద్దతు, నిబద్ధత పట్ల పెట్టుబడిదారులందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకు బోర్డు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. గత వారంలో స్టాక్‌లో అస్థిరత ఉన్నప్పటికీ, కంపెనీపై దాని వ్యాపారం, నిర్వాహణ విషయాలపై మీ విశ్వాసం నిలకడగా ఉంది. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని తెలిపారు. 

అసాధారణ పరిస్థితుల దృష్ట్యా, సమస్యలతో ముందుకు వెళ్లడం నైతికంగా సరైనది కాదని అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ బోర్డు భావించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘అదానీ కంపెనీపై పెట్టుబడిదారుల ఆసక్తి చాలా ముఖ్యమైనది. అందువల్ల ఏదైనా కారణాల వల్ల సంభవించే ఆర్థిక నష్టాల నుంచి వారిని రక్షించడానికి, FPOతో ముందుకు వెళ్లకూడదని బోర్డు నిర్ణయించుకుంది’ అని అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఇంకా ‘బలమైన లావాదేవీలతో,  సురక్షితమైన ఆస్తులతో మా బ్యాలెన్స్ షీట్ చాలా మెరుగ్గా ఉంది. మా రుణానికి సేవ చేయడంలో మాకు నిష్కళంకమైన ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ నిర్ణయం మా ప్రస్తుత కార్యకలాపాలు, భవిష్యత్తు ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం చూపదు’ అని కూడా తెలిపింది అదానీ కంపెనీ.