Smartwatches: స్మార్ట్‌వాచ్ కొనే ఆలోచనలో ఉన్నారా..? అద్భుతమైన ఫీచర్లతో అందుబాటు ధరలో ఉన్న టాప్ 4 స్మార్ట్‌వాచ్‌లివే..

అన్ని రకాల ఫీచర్లతో.. స్మార్ట్‌ఫోన్ చేయగలిగే పనులన్నింటినీ చేయగల పలు స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుత మార్కెట్‌లో అనేకం ఉన్నాయి. ఇవి మనకు సమయాన్ని తెలియజేయడమే కాక మన ఆరోగ్యాన్ని

Smartwatches: స్మార్ట్‌వాచ్ కొనే ఆలోచనలో ఉన్నారా..? అద్భుతమైన ఫీచర్లతో అందుబాటు ధరలో ఉన్న టాప్ 4 స్మార్ట్‌వాచ్‌లివే..
Best Smartwatches in Indian Market
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 02, 2023 | 8:00 AM

గతంలో సమయం తెలుసుకోవాలంటే గోడ గడియారం వైపే చూసేవారు అంతా కూడా. కానీ కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ వస్తున్న టెక్నాలజీ కారణంగా ఆ గడియారం అవసరం లేకుండా పోయింది. అన్ని రకాల ఫీచర్లతో.. స్మార్ట్‌ఫోన్ చేయగలిగే పనులన్నింటినీ చేయగల పలు స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుత మార్కెట్‌లో అనేకం ఉన్నాయి. ఇవి మనకు సమయాన్ని తెలియజేయడమే కాక మన ఆరోగ్యాన్ని కూడా నిరంతరం పర్యవేక్షిస్తుంది. బీపీ, హార్ట్ బీట్, ఆక్సిజన్ స్థాయి, ఖర్చయ్యే ఎనర్జీ.. ఇలా మనిషి శరీరానికి సంబంధించిన అన్ని వివరాలను మనముందుంచుతుంది ఈ స్మార్ట్‌వాచ్. అంతేకాదు.. దీనిని ముట్టుకోకుండానే వాచ్ లోనే కాల్స్ మాట్లాడుకోవచ్చు, మెసేజెస్‌కు రెస్పాండ్ అవ్వవచ్చు. ఇంకొంచెం ధర ఎక్కువైనా పర్లేదు అనుకుంటే ‘జీపీఎస్’ టెక్నాలజీ ఉన్న స్మార్ట్‌వాచులు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి తక్కువ ధరలో ది బెస్ట్ అనిపించుకుంటున్న స్మార్ట్‌వాచుల వివరాలు ఏమిటో తెలుసుకుందాం..

బోట్ వేవ్ ఎలక్ట్రా: ఈ స్మార్ట్‌ వాచ్‌లో 1.81 ఇంచెస్‌ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. బ్లూటూత్ కాలింగ్‌ ఫీచర్ ఉంది. ఈ వాచ్‌లో గరిష్టంగా 50 వరకు ఫోన్‌ కాంటాక్ట్స్‌ను స్టోర్‌ చేసుకోవచ్చు. ఆన్‌బోర్డ్‌ హెచ్‌డీ మైక్‌ను అందించారు. ఇందులో 100+ స్పోర్ట్స్ మోడ్స్‌తో పాటు హార్ట్ రేట్, స్లీప్ మానిటర్, SpO2 ట్రాకింగ్, బ్రీత్ ట్రైనర్‌ వంటి ఫీచర్లతో యూజర్లు హెల్త్ ట్రాకింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్మార్ట్‌వాచ్ రూ. 3,112 ధరకు అందుబాటులో ఉంది.

ఫైర్‌బోల్ట్ నింజా కాల్ ప్రో: ఈ స్మార్ట్ వాచ్ 1.69 ఇంచెస్ HD డిస్‌ప్లేతో ఉంటుంది. ఇది బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే, ఏఐ వాయిస్ అసిస్టెన్స్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. SPO2 / బ్లడ్ ఆక్సిజన్ ట్రాకింగ్, డైనమిక్ హార్ట్ రేట్ మానిటరింగ్ వంటి100 వర్కౌట్ మోడ్‌లు ఉన్నాయి. ఇది మీ అన్ని కార్యకలాపాలను ట్రాక్ చేస్తుంది. దీని అసలు ధర రూ. 10వేలకు పైగా కాగా, ప్రస్తుతం రూ. 1,999కే అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

రెడ్‌ మీ వాచ్‌ 2 లైట్: రెడ్‌ మీ నుంచి లభిస్తున్న ఈ స్మార్ట్‌ వాచ్‌ ప్రముఖ ఈ కామర్స్‌ సైట్స్‌ లో రూ.3,499కు లభిస్తోంది. ఇందులో 1.55 ఇంచెస్ హెచ్డి డిస్ ప్లే అందించారు. దీనిలో ఉన్న ఇన్‌ బిల్ట్‌ జీపీఎస్‌ సిస్టమ్‌ అక్యురేట్‌ ఫలితాలు అందిస్తోంది. బ్లాక్‌, బ్లూ, ఐవరీ వంటి 3 డిఫరెంట్‌ వాచ్‌ స్ట్రాప్‌ కలర్స్‌ తో లభిస్తోంది. 100+ ప్రో వర్కౌట్ మోడ్‌లు, SpO2, ఉమెన్స్ హెల్త్, కస్టమ్ వాచ్‌ఫేస్‌లు, 6 యాక్సిస్ సెన్సార్‌లు వంటి ఫీచర్స్ అదనం. 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

నాయిస్ పల్స్ గో బజ్: సరికొత్త బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ రూ. 1,799 ధరకు అందుబాటులో ఉంది. 1.69 ఇంచెస్ క్లియర్ డిస్‌ప్లే అందించారు. ఇందులో150+ వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ 24 గంటల పాటు మీ హార్ట్ బీట్ ను మానిటర్ చేస్తుంది. అలాగే.. స్టెప్స్ కౌంట్, స్లీప్ ట్రాకర్ వంటి హెల్త్ ఫీచర్స్ ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..