Mercedes-Benz EQB: భారత్‌లో లాంచ్ అయిన మెర్సిడెస్ బెంజ్ కార్.. ధర, ఫీచర్లు, మైలేజీ వివరాలు మీ కోసం..
ప్రపంచ స్థాయి లగ్జరీ కార్ మేకర్ మెర్సిడెస్ బెంజ్ తన కొత్త ‘ఈక్యూబి’ ఎలక్ట్రిక్ కారును మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈక్యూబి పేరుతో భారతీయ మార్కెట్లలో..
ప్రపంచ స్థాయి లగ్జరీ కార్ మేకర్ మెర్సిడెస్ బెంజ్ తన కొత్త ‘ఈక్యూబి’ ఎలక్ట్రిక్ కారు(Mercedes-Benz EQB)ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈక్యూబి పేరుతో భారతీయ మార్కెట్లలో లాంచ్ చేసిన ఈ కారు ధరను రూ. 74.50 లక్షలు (ఇండియా ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది కంపెనీ. బెంజ్ ఈక్యూబి ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఆసక్తి ఉన్న కస్టమర్లు కేవలం రూ. 1.5 లక్షలు చెల్లించి ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. ఇక మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబి 300, మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబి 350 అనే రెండు వేరియంట్లలో వస్తోంది. రంగుల విషయానికి వస్తే స్మోస్ బ్లాక్, రోజ్ గోల్డ్, డిజిటల్ వైట్, మౌంటైన్ గ్రే , ఇరిడియం సిల్వర్ అనే 5 కలర్ ఆప్సన్స్‌లో అందుబాటులోకి రాబోతున్నాయి.
దీంతోపాటు జీఎల్‌బీ త్రి-రో ఎస్‌యూవీని కూడా మార్కెట్లోకి మెర్సిడెస్ తీసుకొచ్చింది. దీని ధర రూ. 63.8 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. బెంజ్ ఈక్యూబి ఎలక్ట్రిక్ ఎస్‌యువిలో(Mercedes-Benz EQB) 66.5kWh బ్యాటరీ ఉంది.ఈ బ్యాటరీ ప్యాక్ 225bhp ,390Nm టార్క్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. AC , DC ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేసే మోడల్, WLTP-సర్టిఫైడ్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 423 కిమీ రేంజ్ అందిస్తుంది. 100 కిలో వాట్ DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 32 నిముషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. ఈ బ్యాటరీ మీద 8 సంవత్సరాల వారంటీని అందిస్తుంది మెర్సిడెస్ కంపెనీ. 11 కిలోవాట్ AC ఛార్జర్ ఉపయోగించి 10 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోవడానికి 6 గంటల 25 నిముషాల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది.
అదనపు ఆకర్షణగా స్వెప్ట్‌బ్యాక్ LED హెడ్‌ల్యాంప్‌లు, బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్, స్పిట్ LED టెయిల్ లైట్లు, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, పవర్డ్ టెయిల్‌గేట్, వైర్‌లెస్ ఛార్జింగ్ USB టైప్-C పోర్ట్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, రీప్రొఫైల్డ్ ఫ్రంట్ , రియర్ బంపర్ యాంబియంట్ లైటింగ్‌తో పాటు 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్,ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్ లాంటి ఫీచర్లు ఇందులో జోడించింది మెర్సిడెస్ కంపెనీ.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి