Hyderabad: కోటి ఆశలతో కొత్తింట్లో అడుగుపెట్టారు.. కట్ చేస్తే.. ఆ రోజు రాత్రి పాతింట్లో ఏం జరిగిందంటే..
మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి గృహప్రవేశం కూడా చేశాడు. ఈ సమయంలో కుటుంబం అంతా కలిసి అక్కడే బస చేశారు. ఆ రోజు రాత్రి అక్కడే ఉండి.. బుధవారం ఇంటికి వెళ్లాడు..
హైదరాబాద్ నగరంలో దొంగలు రెచ్చిపోయారు. జీడిమెట్ల పరిధిలోని చింతల్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. లక్షల్లో నగదు, భారీగా బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చింతల్‌లోని శివానగర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మనోహర్ కుటుంబంతో సహా నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో దుండిగల్ సమీపంలోని బహదూర్‌పల్లిలో ఇటీవల కొత్తగా ఇంటిని నిర్మించుకున్నాడు.
మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి గృహప్రవేశం కూడా చేశాడు. ఈ సమయంలో కుటుంబం అంతా కలిసి అక్కడే బస చేశారు. ఆ రోజు రాత్రి అక్కడే ఉండి.. బుధవారం ఇంటికి వెళ్లి చూడగా బీరువా తాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని సామాన్లు, పలు వస్తువులు చెల్లాచెదురుగా పడేసి ఉన్నాయి.
బీరువాలో ఉన్న రూ.7లక్షల నగదు, 10 తులాల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లినట్లు మనోహర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మనోహర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..