Green Tea Benefits: గ్రీన్ టీ ప్రయోజనాలు అనేకం.. కానీ ఇలా తాగితే క్యాన్సర్ కూడా దూరం..

శివలీల గోపి తుల్వా

శివలీల గోపి తుల్వా |

Updated on: Feb 06, 2023 | 2:09 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధులలో గుండెపోటు తర్వాత క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే గ్రీన్ టీ తాగాలని ఆరోగ్య నిపుణులు..

Green Tea Benefits: గ్రీన్ టీ ప్రయోజనాలు అనేకం.. కానీ ఇలా తాగితే క్యాన్సర్ కూడా దూరం..
Green Tea

ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధులలో గుండెపోటు తర్వాత క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే గ్రీన్ టీ తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వారి సూచనల ప్రకారం పాలు, పంచదార, టీ ఆకులతో చేసిన టీ కంటే గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంకా ఈ హెర్బల్ టీని తాగడం వల్ల బరువు తగ్గుతారు. అయితే ఈ గ్రీన్ టీలో కొన్ని ప్రత్యేకమైన వాటిని జోడిస్తే దీని  ప్రయోజనాలు రెట్టింపు స్థాయిలో పెరుగుతాయి. మరి ఆ ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

గ్రీన్ టీ ప్రయోజనాలు

అల్లం: వంటకాల్లో మసాలా దినుసుగా ఉపయోగించే అల్లం.. ఆహారం రుచిని పెంచుతుంది. గ్రీన్ టీలో ఈ అల్లం కలిస్తే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. గ్రీన్ టీలో అల్లం కలిపి తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అంతేకాక క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు.

పుదీనా ఆకులు, దాల్చిన చెక్క: కొంతమంది గ్రీన్ టీలో పుదీనా ఆకులు, దాల్చిన చెక్కను కలుపుకుని  తాగుతారు. ఎందుకంటే ఇది శరీర ఇమ్యూనిటీ పెంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది తాగినతర్వాత చాలాసేపు వరకు ఆకలి వేయదు. తద్వారా ఈ టీ తాగిన వారు బరువు  కూడా తగ్గుతారు.

ఇవి కూడా చదవండి

నిమ్మకాయ: నిమ్మకాయను గ్రీన్ టీలో కలిపి తీసుకుంటే రుచి కొద్దిగా మారుతుంది. ఈ రెండు కాంబినేషన్ మీ శరీరానికి మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లను పెంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

స్టీవియా ఆకులు: స్టీవియాను తెలుగులో ‘మధుపత్రి’ అని అంటారు. ఇది గ్రీన్ టీతో కలిపితే తీపి యాడ్ అవుతుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే క్యాలరీలు తగ్గడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. ఇది డయాబెటిక్ పేషెంట్లుకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu