AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anantapuram: కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న వింత ఆచారం.. ఆ ఒక్కరోజు పశువులతో సహా ఊరంతా ఖాళీ..

అనంతలో ఓ వింత ఆచారం ఆశ్చర్యపరుస్తోంది. దశాబ్దాలుగా తూచా తప్పకుండా పాటిస్తున్నారు అక్కడి జనం. ఇంతకీ ఏంటా ఆచారం? ఎందుకు కొనసాగుతూ వస్తుంది తెలుసుకుందాం.. 

Anantapuram: కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న వింత ఆచారం.. ఆ ఒక్కరోజు పశువులతో సహా ఊరంతా ఖాళీ..
Talari Cheruvu Village
Surya Kala
|

Updated on: Feb 07, 2023 | 6:48 AM

Share

ఆధునిక యుగంలోనూ ఇప్పటికి కొన్ని వింత ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. వింతగా అనిపించే ఆచారాలను నమ్మలను ప్రజలు పాటిస్తూనే ఉన్నారు.  అలాంటి వింత ఆచారాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో కొన్ని దశాబ్దాలుగా తప్పనిసరిగా అనుసరిస్తున్నారు. మాఘ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు రోజున జిల్లాలోని ఓ గ్రామం అంతా ఖాళీ అవుతుంది. గ్రామస్తులందరూ తమ పెంపుడు జంతువులను తీసుకుని ఇళ్లను వదిలి ఓ దర్గా వద్దకు చేరుకుంటారు.  అసలు గ్రామంలో పూర్ణమి ఘడియల్లో కనీసం అగ్గి, వెలుగు లేకుండా చూస్తారు. ఈ వింత సంప్రాదయానికి ఒక కారణం ఉందని చెబుతున్నారు గ్రామస్థులు. వివరాల్లోకి వెళ్తే..

అనంతపురం జిల్లాలో వింత ఆచారం పాటిస్తున్నారు తలారి చెరువు గ్రామస్థులు. మాఘ మాసం పౌర్ణమికి ముందు రోజు ఊరు ఊరంతా ఖాళీ అవుతుంది. వినడానికి వింతగా ఉన్న ఈ సంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. ఇంటికి తాళం వేయడం.. పెట్టాబేడా సర్దుకుని ఊరొదిలి వెళ్లిపోవడం.. నట్టింట్లో లైట్లు ఆఫ్‌ చేయడం.. ఈ ఆచారంలో భాగం. అగ్గిపాడు పేరుతో ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఇదంతా ఎందుకంటే పల్లె మేలు కోసం.. జనం బాగు కోసమే అంటున్నారు తలారి చెరువు గ్రామస్థులు. అగ్గిపాడు ఆచారం వెనుక ఎంతో చరిత్ర ఉందంటున్నారు గ్రామస్తులు.

పూర్వం తలారిచెరువు గ్రామాన్ని ఓ బ్రాహ్మణుడు దోచుకోవడంతో గ్రామస్తులంతా కలిసి చంపడంతో, ఊళ్లో పుట్టిన పిల్లలు చనిపోతూ వచ్చారట. బ్రాహ్మణుడిని హత్య చేయడం వల్లే పిల్లలు చనిపోతున్నారని చెప్పిన ఓ జ్యోతిష్యుడు. పరిష్కార మార్గంగా అగ్గిపాడు ఆచారం పాటించాలని చెప్పారట. అప్పట్నుంచి ఈ ఆచారం కొనసాగిస్తూ వస్తున్నామంటున్నారు గ్రామస్తులు. మొత్తానికి అగ్గి, లైట్లు వెలిగించకుండా అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు తలారి చెరువు గ్రామస్థులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
స్టార్ హీరో సినిమాలో రోల్ అని చెప్పి మోసం చేశారు..
స్టార్ హీరో సినిమాలో రోల్ అని చెప్పి మోసం చేశారు..
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..