Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naming Ceremony: ఆవు దూడకు బారసాల చేసిన దంపతులు.. విష్ణు అని నామకరణం.. దేశీయ గోవులను రక్షించాలని పిలుపు

అవును చిన్నపిల్లలకు బారసాల చేయడం, ఉయ్యాలలో వేసి పాటలు పాడటం సర్వసాదారణం. ఇక్కడ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ లేగదూడకు బారసాల చేసి.. మూగజీవాలపై ప్రమేను చాటి చెప్పారు దంపతులు

Naming Ceremony: ఆవు దూడకు బారసాల చేసిన దంపతులు.. విష్ణు అని నామకరణం.. దేశీయ గోవులను రక్షించాలని పిలుపు
Baby Cow Namakarana Fest
Follow us
Surya Kala

|

Updated on: Feb 04, 2023 | 7:07 AM

హిందువులకు గోమాత అత్యంత పవిత్రమైన జంతువు. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని దైవంగా భావించి పూజిస్తారు. ఆవును పూజిస్తే అష్టైశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంపదలు లభిస్తాయని.. సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని విశ్వాసం.  చాలామంది ఆవుని పెంచుకోవడానికి ఇష్టపడతారు. సొంత ఇంటి పిల్లల్లా భావించి అల్లముద్దుగా పెంచుకునే వారు ఎందరో ఉన్నారు. ఆవులు.. వాటి సంతానాన్ని తమ ఇంటి సభ్యుల్లా ఎంతో అల్లారు ముద్దుగా చూడడమే కాదు.. వాటికి సీమంతం, పుట్టిన రోజు , నామకరణం వంటి ఫంక్షన్లు జరిపి పదిమందికి తమ సంతోషాన్ని పంచుతూ వేడుకలను జరుపుతారు. అయితే ఆవుకు బారసాల చేయడం మాత్రం అరుదు అని చెప్పవచ్చు. ఈ వేడుకను కూడా అత్యంత ఘనంగా జరిపారు ఓ కుటుంబ సభ్యులు.

అవును చిన్నపిల్లలకు బారసాల చేయడం, ఉయ్యాలలో వేసి పాటలు పాడటం సర్వసాదారణం. ఇక్కడ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ లేగదూడకు బారసాల చేసి.. మూగజీవాలపై ప్రమేను చాటి చెప్పారు దంపతులు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం వేళ్లటూరులో జరిగింది. లేగదూడకు బారసాల కార్యక్రమం వైభవంగా జరిపారు. ఆ లేగ దూడకు విష్ణు అని నామకరణం చేశారు. పిల్లలు కల్గిన గోవులను ఎంతో ఆప్యాయంగా పెంచుకుంటున్నారు వల్లీ , సత్యనారాయణ దంపతులు.

గత 11 సంవత్సరాల క్రితం ఒక గోవుతో మొదలైన పెంపకం ఇప్పుడు 60 గోవులకు చేరింది. గోవులను పెంచుతుంటే తమకు పిల్లలు లేని లోటు తీరిందని చెప్తున్నారు వల్లీ, సత్యనారాయణ దంపతులు. దేశీయ గోవులను సంరక్షిచడం.. వాటి సంతతిని పెంపొదించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ దంపతులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..