AP CM Jagan: వైసీపీ సర్కార్ త్వరలో ‘జగనన్నకు చెబుదాం’ పేరుతో కొత్త కార్యక్రమం.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా..

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి అధికారి పనిచేయాలనే ఉద్ధేశంతో ముందుకెళ్తున్నారు సీఎం జగన్. స్పందన కార్యక్రమానికి కొనసాగింపుగా మరో కార్యక్రం చేపట్టబోతున్నారు.

AP CM Jagan: వైసీపీ సర్కార్ త్వరలో 'జగనన్నకు చెబుదాం' పేరుతో కొత్త కార్యక్రమం.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా..
Cm Jagan
Follow us
Surya Kala

|

Updated on: Feb 04, 2023 | 6:11 AM

ఏపీలో వైసీపీ సర్కార్ త్వరలో “జగనన్నకు చెబుదాం” పేరుతో కొత్త కార్యక్రమం చేపట్టబోతోంది. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న స్పందన కార్యక్రమానికి కొనసాగింపుగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం స్పందన కార్యక్రమాన్ని ప్రతీ సోమవారం క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్ధాయి వరకూ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జనం నుంచి వచ్చే ఫిర్యాదుల్లో కొన్నింటిని  పరిష్కరించడంలో కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. వీటిని అధిగమిస్తూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో పనిచేయాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం జగన్.

జగనన్నకు చెబుదాం కార్యక్రమం సన్నాహకాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ప్రతి అధికారి కూడా.. వినతి పరిష్కారమయ్యే వరకు ట్రాక్ చేయాలన్నారు. అందిన అర్జీలపై ప్రతి వారం కూడా ఆడిట్‌ చేసి నివేదిక తీసుకోవాలన్నారు. ట్రాకింగ్, పర్యవేక్షణ జరుగుతుందా? లేదా? అన్నదానిపై ప్రతివారం సమీక్ష చేయాలన్నారు. ప్రభుత్వ విభాగాల్లో అర్జీలు, ఫిర్యాదుల స్వీకరణకు ఇప్పటికే ఉన్న కాల్‌ సెంటర్లను అనుసంధానం చేయాలనీ.. వాటి పరిష్కారం కోసం ఇప్పటివరకూ ఉన్న పద్ధతులను మరోసారి పరిశీలించి, తిరిగి పునర్నిర్మాణం చేయాలన్నారు. పోలీసులు, రెవిన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్‌ అధికారులతో కూడిన మండల, మున్సిపల్‌ స్థాయి సమన్వయ కమిటీ ప్రతివారం సమావేశమై అర్జీల పరిష్కారంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు సీఎం జగన్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..