Andhra Pradesh: నెల్లూరు నుంచి గుంటూరుకు రాజకీయం..! బోరుగడ్డ అనిల్‌ ఆఫీస్‌కు నిప్పు పెట్టిన దుండగులు..

నెల్లూరు రూరల్‌లో మొదలైన కోటంరెడ్డి శ్రీధర్ రాజకీయం గుంటూరు వరకూ పాకిందా? పాకిందో లేదో గానీ.. బోరుగడ్డ అనిల్ చేస్తున్న ఆరోపణలు ఇవి. సీఎం జగన్‌కి వ్యతిరేకంగా మాట్లాడితే వెహికిల్‌కి కట్టి ఈడ్చుకెళ్తామన్న బోరుగడ్డ అనిల్‌ ఫోన్‌కాల్‌కి ఆ మర్నాడే ప్రెస్‌మీట్‌లో కౌంటర్ ఇచ్చారు.

Andhra Pradesh: నెల్లూరు నుంచి గుంటూరుకు రాజకీయం..! బోరుగడ్డ అనిల్‌ ఆఫీస్‌కు నిప్పు పెట్టిన దుండగులు..
Ap News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 07, 2023 | 8:26 AM

నెల్లూరు రూరల్‌లో మొదలైన కోటంరెడ్డి శ్రీధర్ రాజకీయం గుంటూరు వరకూ పాకిందా? పాకిందో లేదో గానీ.. బోరుగడ్డ అనిల్ చేస్తున్న ఆరోపణలు ఇవి. సీఎం జగన్‌కి వ్యతిరేకంగా మాట్లాడితే వెహికిల్‌కి కట్టి ఈడ్చుకెళ్తామన్న బోరుగడ్డ అనిల్‌ ఫోన్‌కాల్‌కి ఆ మర్నాడే ప్రెస్‌మీట్‌లో కౌంటర్ ఇచ్చారు. బెదిరింపులతో తన గొంతు నొక్కలేరన్నారు. ఇప్పుడు గుంటూరు అగ్నిప్రమాదం తర్వాత కూడా బోరుగడ్డ అనిల్ అదే మాట అంటుండటం చర్చనీయాంశంగా మారింది.

రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ నేత బోరుగడ్డ అనిల్‌ కుమార్‌ పార్టీ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగుల బెట్టారు. గుంటూరులో అర్థరాత్రి సమయంలో ఆఫీస్‌ కార్యాలయంపై పెట్రోల్‌ చల్లి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఫర్నిచర్‌ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. అయితే ఇది స్థానిక టీడీపీ నాయకులపనేనని ఆరోపిస్తున్నారు అనిల్‌ కుమార్‌. ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపించి నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

గుంటూరు డొంకరోడ్డులో ఉన్న ఆఫీసును అర్థరాత్రి సమయంలో దుండగులు తగులబెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పారు.

ఇవి కూడా చదవండి

ఇది ప్రమాదం కాదు.. పెట్రోల్‌ పోసి తగలపెట్టారని పేర్కొ్న్న అనిల్‌.. కోటంరెడ్డి శ్రీధర్‌తోపాటు టీడీపీ నేతలపై అనిల్ అభియోగం మోపారు. నక్కా ఆనంద్‌బాబు సూత్రధారి, అనుచరులు పాత్రధారులని ఫిర్యాదు చేశారు. కోటంరెడ్డి, టీడీపీ నుంచి ప్రాణహాని ఉందని, న్యాయంతోపాటు రక్షణ కల్పించాలని సీఎం జగన్‌కి మొరపెట్టుకున్నారు.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే