- Telugu News Photo Gallery Business photos PM Kisan Yojana: 13th installment will come in this month, but these farmers will not get two thousand rupees
PM Kisan Yojana: రైతులకు బిగ్ అలెర్ట్.. ఈ ప్రక్రియ పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ నగదు జమ.. లేకపోతే..
కేంద్ర ప్రభుత్వం.. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. రైతులకు ఏటా రూ.6 వేలు అందజేస్తోంది. ఏడాదికి మూడుసార్లు 2 వేల రూపాయల చొప్పున మూడు వాయిదాలలో రైతుల ఖాతాలో జమచేస్తోంది.
Updated on: Feb 06, 2023 | 1:54 PM

మీ ఆధార్ నంబర్, ఖాతా నంబర్ తప్పుగా ఉంటే, దాన్ని సరిచేయవచ్చు. మీ ఖాతాలో రూ. 2000 జమకాకపోతే ఇక్కడ సంప్రదించండి

Pm Kisan

కానీ ఏదైనా కారణం వల్ల పేరును ప్రభుత్వం తిరస్కరించినట్లయితే, అతను అర్హత పొందలేడు. అలాంటివారికి ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బు అందదు. అయితే, పైన తెలిపిన కారణాల వల్ల నగదు రాకపోతే ఇలా చేయండి. దీంతో నగదు జమ అయ్యే అవకాశం ఉంటుంది.

ఇక్కడ మీకు ఆధార్ నంబర్, అకౌంట్ నంబర్, ఫోన్ నంబర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, గెట్ డేటాపై క్లిక్ చేయండి. ఈ ప్రక్రియను అనుసరించిన తర్వాత, మీ సమాచారం ఇక్కడ క

PM కిసాన్ యోజన యొక్క 13వ విడత ప్రయోజనాన్ని పొందడానికి, రైతులు వారి PM కిసాన్ ఖాతాకు సంబంధించి EKYC ని తప్పనిసరి చేయాలి. అతను ఇలా చేయకపోతే అతని 13వ విడత నగదు అందడం కష్టం. PM కిసాన్ EKYC ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చేయవచ్చు.

PM కిసాన్ eKYC ఆఫ్‌లైన్‌లో పూర్తి చేయడానికి, మీరు సమీపంలోని CSC కేంద్రానికి వెళ్లాలి. ఆన్లైన్ లో అయితే, PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in ద్వారా కూడా చేయవచ్చు.

ల్యాండ్ వెరిఫికేషన్ కూడా చేయవలసి ఉంటుంది. మీరు ఇంకా ల్యాండ్ వెరిఫికేషన్ చేయకపోతే, దీని కోసం సమీపంలోని వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించండి.

PM కిసాన్ యోజన కింద, సంవత్సరంలో మొదటి విడత ఏప్రిల్ 1 - జూలై 31 మధ్య విడుదల అవుతుంది. రెండో విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30లోపు.. డిసెంబర్ 1 నుంచి మార్చి 31లోగా మూడో విడత నగదు రైతుల ఖాతాల్లో జమ అవుతుంది.





























