Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జియా ప్రెగ్నెంట్ అంట.. శుభవార్త చెప్పిన ట్రాన్స్‌జెండర్ జంట.. దేశంలోనే మొదటిసారిగా..

దేశంలో మొదటిసారిగా కేరళకు చెందిన జహాద్‌, జియా పావల్‌ అనే ట్రాన్స్‌జెండర్‌ జంట మరో నెలలో బిడ్డకు జన్మనివ్వనున్నారు. కేరళలోని కోజికోడ్‌కు చెందిన లింగమార్పిడి జంట జియా, జహాద్‌లు మార్చిలో..

జియా ప్రెగ్నెంట్ అంట.. శుభవార్త చెప్పిన ట్రాన్స్‌జెండర్ జంట.. దేశంలోనే మొదటిసారిగా..
Transgender Couple
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 04, 2023 | 10:00 AM

దేశంలో మొదటిసారిగా కేరళకు చెందిన జహాద్‌, జియా పావల్‌ అనే ట్రాన్స్‌జెండర్‌ జంట మరో నెలలో బిడ్డకు జన్మనివ్వనున్నారు. కేరళలోని కోజికోడ్‌కు చెందిన లింగమార్పిడి జంట జియా, జహాద్‌లు మార్చిలో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నామని అధికారికంగా ప్రకటించారు. గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో సంతోషకరమైన వార్తను ప్రకటించింది.‘తల్లి కావాలనుకునే నా కల, తండ్రి కావాలనుకునే తన కోరిక.. త్వరలోనే తీరనునున్నాయి.’ తాను ప్రెగ్నెంట్ అంటూ జియా పావెల్‌ ఇన్‌స్టాలో రాసింది. అయితే, సంతానం కోసం.. అబ్బాయిగా మారే చికిత్సను జహాద్‌ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. “నేను పుట్టుకతో స్త్రీని కానప్పటికీ, ఒక శిశువు నన్ను ‘అమ్మా’ అని పిలవాలనే కల నాలో ఉంది.. మేము కలిసి మూడు సంవత్సరాలు అయ్యింది. తల్లి కావాలని నేను, తండ్రి కావాలని అతను (జహాద్) కలలు కన్నాడు. ఈ రోజు అతని పూర్తి సమ్మతితో ఎనిమిది నెలల జీవితం కడుపులో కదులుతోంది” అని జియా పోస్ట్‌కు క్యాప్షన్‌లో రాసింది.

కోజికోడ్‌కు చెందిన జియా పురుషుడిగా పుట్టి స్త్రీగా మారగా, జహాద్ స్త్రీగా పుట్టి పురుషుడిగా మారిపోయిన విషయం తెలిసిందే. జహాద్ జియా ద్వారా గర్భం దాల్చాడు. దీంతో శిశువు కోసం జహాద్ పురుషునిగా మారే ప్రక్రియ నిలిచిపోయింది. “కాలం మనల్ని కలిపేసింది.. మూడేళ్లయింది. నా అమ్మ కలలా, నాన్నగారి కల, మా స్వంత కోరిక మనల్ని ఒక్క ఆలోచనలోకి తెచ్చాయి. ఈరోజు 8 నెలల జీవనం పూర్తి అంగీకారంతో తన కడుపులో కదులుతున్నాడు.. మా కోరికలను నెరవేర్చడానికి మేము తీసుకున్న నిర్ణయాలకు మద్దతు ఇస్తున్నారు.” అని జియా క్యాప్షన్‌లో రాశారు. “మాకు తెలిసినంతవరకు భారతదేశంలో మొదటి TRAN’S MAN PREGNANCY” అంటూ జియా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Ziya Paval (@paval19)

కాగా.. ఈ విషయం షేర్ చేసినప్పటినుంచి జియా, జహాద్‌ జంటకు శుభాకంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ లో వందలాది మంది కామెంట్లు చేస్తున్నారు. ఇది స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం.. ప్రేమకు ఎలాంటి హద్దులు ఉండవు.. దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు.. అంటూ పేర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..