Black Fruits: ఆ ప్రమాదకర వ్యాధులకు దివ్యౌషధం.. ఈ నల్లని పండ్లు.. తప్పనిసరిగా తెలుసుకోండి..

పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని పండ్లు పోషకాలతో నిండి ఉంటాయి. పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఆరోగ్య నిపుణులు అన్ని పండ్లను తినాలని సూచిస్తుంటారు.

Black Fruits: ఆ ప్రమాదకర వ్యాధులకు దివ్యౌషధం.. ఈ నల్లని పండ్లు.. తప్పనిసరిగా తెలుసుకోండి..
Black Fruits
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 02, 2023 | 10:00 AM

పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని పండ్లు పోషకాలతో నిండి ఉంటాయి. పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఆరోగ్య నిపుణులు అన్ని పండ్లను తినాలని సూచిస్తుంటారు. కానీ వ్యాధులలో పండ్ల వినియోగం విషయానికి వస్తే.. పండ్లను ఎంచుకోవడం కష్టంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో నలుపు పండ్లు (బ్లాక్ ఫ్రూట్స్) తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. నల్లటి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను నయం చేస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఏలాంటి బ్లాక్ ఫ్రూట్స్ తినాలి.. ఏది తింటే మంచిది అనే విషయాలను తెలుసుకుందాం..

నల్ల ద్రాక్ష: ద్రాక్ష రుచిలో పుల్లగా ఉంటుంది. కానీ అవి ఆరోగ్యానికి చాలా మంచిది. ద్రాక్షలో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వీటి వినియోగం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది.

నల్ల అత్తి పండ్లు: బ్లాక్ అంజీర్ పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఉండే ప్రోబయోటిక్ లక్షణాలు జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. అత్తి పండ్లలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

నల్ల రేగు పండ్లు: బ్లాక్‌బెర్రీస్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, ఫైబర్, మాంగనీస్ వంటి పోషకాలు వీటిలో పుష్కలంగా లభిస్తాయి. మెదడు ఆరోగ్యంగా ఉండేలా పనిచేస్తాయి. బ్లాక్‌బెర్రీస్ కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. ఇవి డయాబెటిస్‌లో కూడా ప్రయోజనకరంగా పరిగణిస్తారు.

బ్లాక్ చెర్రీ: చాలా మందికి చెర్రీ ఎరుపు రంగు గురించి మాత్రమే తెలుసు. బ్లాక్ చెర్రీ కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. బ్లాక్ చెర్రీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. కీళ్లనొప్పులు, జీర్ణక్రియ వంటి సమస్యలను దూరం చేయడంలో ఇది మేలు చేస్తుంది.

బ్లాక్ కిస్‌మిస్: నల్ల ఎండుద్రాక్ష ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. నల్ల ఎండుద్రాక్ష రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీన్ని తినడం వల్ల ఎముకలు కూడా దృఢంగా మారుతాయి. నల్ల ఎండుద్రాక్ష రక్తహీనతను కూడా తొలగిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..