- Telugu News Photo Gallery Business photos EPFO Updates: TDS rate on EPF withdrawals reduced to 20% from 30% in Budget 2023 in these cases
EPFO: పీఎఫ్ ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ విషయంలో బిగ్ రిలీఫ్..
కేంద్ర ప్రభుత్వం 2023 - 24 సంవత్సరానికి గానూ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కేంద్రం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంలో వెల్లడించారు.
Updated on: Feb 02, 2023 | 1:45 PM

కేంద్ర ప్రభుత్వం 2023 - 24 సంవత్సరానికి గానూ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కేంద్రం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంలో వెల్లడించారు. ఈ సందర్భంగా పీఎఫ్ ఉద్యోగులకు కూడా శుభవార్త చెప్పారు. బడ్జెట్ 2023లో EPFO ఉపసంహరణలో పలు మార్పులు చేసినట్లు ప్రకటించారు. ఈపీఎఫ్ఓ ఉపసంహరణపై TDS నియమాలను మారుస్తున్నట్లు ప్రకటించారు.

ఇప్పుడు 5 సంవత్సరాల ముందు పీఎఫ్ ఉపసంహరణ చేస్తే, ఖాతాకు పాన్ లింక్ చేయకపోతే TDS 30% ఉండగా.. దానిని 10% శాతానికి తగ్గించినట్లు ప్రకటించారు. ఇది EPFOలోని రికార్డులతో PAN అప్‌డేట్ చేయని వ్యక్తులకు సహాయపడుతుంది.

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు PAN లింక్ చేయకపోతే, ఉపసంహరణ సమయంలో 30 శాతానికి బదులుగా 20 శాతం TDS విధిస్తారు. ఈ నియమం 1 ఏప్రిల్ 2023 నుంచి వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. ఈ నియమం పాన్ కార్డు జతచేయని ఉద్యోగులందరికీ ఈ ప్రయోజనం లభిస్తుంది.

5 సంవత్సరాలలోపు ఉపసంహరణకు పన్ను విధింపు: పీఎఫ్ ఉపసంహరణ 5 సంవత్సరాలలోపు చేస్తే, అప్పుడు పన్ను విధిస్తారు. ఐదేళ్ల తర్వాత ఉపసంహరణలపై పన్ను మినహాయింపు ఉంటుంది.

5 సంవత్సరాలకు ముందు ఉపసంహరణపై, ఉపసంహరణ మొత్తం 50 వేల వరకు ఉన్నప్పటికీ పన్ను మినహాయింపు ఉండదు. ఉపసంహరణ మొత్తం 50 వేల కంటే ఎక్కువ ఉంటే అప్పుడు కాల వ్యవధి ప్రకారం TDS విధించరు. మినహాయింపు ఉంటుంది.

ఉద్యోగుల ఖాతాకు పాన్ కార్డును లింక్ చేసి ఉంటే 10% TDS విధిస్తారు. పాన్ కార్డ్ లింక్ చేయకుంటే 30% ఉన్న TDS ను 10శాతం తగ్గించి.. 20శాతంగా చేశారు.

PF ఉపసంహరణపై TDSని నివారించడానికి, ఫారమ్ 15G/ఫారమ్ 15Hని సమర్పించవచ్చు. ఫారమ్ 15G/ఫారం 15H, EPF ఉపసంహరణ మొత్తంపై TDSని నివారించడం కోసం ఇస్తారు. ఈ క్రమంలో PAN కూడా సమర్పించాల్సి ఉంటుంది.





























