Tomato Price: రైతన్న కంట కన్నీరు పెట్టిస్తోన్న టమాటా ధర.. అక్కడ మార్కెట్లో కిలో రూపాయి మాత్రమే..
రూపాయికి కనీసం టీ కూడా రావడం లేదు.. కానీ అన్నదాత ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసి.. కన్నబిడ్డలకంటే అధికమైన ప్రేమతో పంటలను సంరక్షిస్తూ.. పంటలను పండించే పంట మాత్రం అవసరమైతే మార్కెట్ లో కిలో అర్ధ రూపాయికి కూడా దొరుకుంటుంది.
గత కొన్ని రోజుల క్రితం వరకూ టమాటా రైతులకు లాభాలను.. సామాన్యులకు కంట కన్నీరు పెట్టించాయి. అయితే ఇప్పుడు టమాటా ధరలు అకస్మాత్తుగా నేలచూపులు చూస్తున్నాయి. నిన్నా మొన్నటి వరకూ కిలో రూ. 30 నుంచి రూ. 40ల వరకూ పలికిన టమాటా ధర.. నేడు కిలో ఐదు రూపాయలు అన్నా కొనేవారు లేరు. కిలో టమోటో ఒక్క రూపాయి పలకడంతో అన్నదాత లబోదిబో అంటున్నారు. రూపాయికి కనీసం టీ కూడా రావడం లేదు.. కానీ అన్నదాత ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసి.. కన్నబిడ్డలకంటే అధికమైన ప్రేమతో పంటలను సంరక్షిస్తూ.. పంటలను పండించే పంట మాత్రం అవసరమైతే మార్కెట్ లో కిలో అర్ధ రూపాయికి కూడా దొరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో టమాటా పంట దిగుబడి అధికంగా ఉండడం.. మరోవైపు ఎగుమతులు సరిగ్గా లేకపోవడంతో టమాటా రైతులు.. నష్టపోతున్నారు.
కుప్పకూలిన టమోటా ధర…
టమోటా ధరలు పతనం కర్నూలు జిల్లా రైతుల్ని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఎమ్మిగనూరు మార్కెట్ లో టమోటా ధర భారీగా పతనమైంది.రైతులు గిట్టుబాటు ధర లేక లబోదిబోమంటున్నారు. గత 10 రోజులుగా ఎమ్మిగనూరు మార్కెట్ లో టమోటాకు ధర లేక రైతులు ఆవేదనా వ్యక్తం చేస్తున్నారు.గిట్టుబాటు ధర లేక కిలో రూపాయి పలకడంతో టమోటా రైతులు రవాణా ఖర్చు కూడా రావడం లేదని తెచ్చిన టమోటా బాక్స్ లను మార్కెట్ లోనే వదిలి, రోడ్ పైన పారబోసి వెళుతున్నారు. ఇప్పటికైనా గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని టమోటా రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..