Watch: ఇంద్రకీలాద్రి కొండపై నుంచి కిందపడ్డ కొండచిలువ.. ఎటు వెళ్లాలో తెలియక అవస్థలు.. చివరకు అలా..

ఉన్నట్టుండి నడిరోడ్డుపై ప్రత్యక్షమైన కొండచిలువను చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. భయపడుతూనే.. కొండచిలువను తమ మొబైల్స్‌లో వీడియోలు తీశారు.

Watch: ఇంద్రకీలాద్రి కొండపై నుంచి కిందపడ్డ కొండచిలువ.. ఎటు వెళ్లాలో తెలియక అవస్థలు.. చివరకు అలా..
Giant Python
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 07, 2023 | 3:08 PM

సోషల్ మీడియాలో తరచూ పాములు, జంతువుల వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పాముల వీడియోలైతే ఇంకా ఆకట్టుకుంటాయి. పాములంటే సాధారణంగానే చాలా మంది భయం. కాబట్టి భయం కల్గించే వాటిని వీడియోల్లో దగ్గర చూసేందుకు జనాలు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఈ వీడియో కూడా అలాంటిదే. రోడ్డుపై ఉన్నట్టుండి పాము ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది. పామును చూడగానే పక్కాగా భయంతో పరుగులు తీస్తారు. అదే భారీ కొండచిలువ కనబడితే ఏం చేస్తారు.. ఇంకేముంది.. బతుకు జీవుడా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరారవుతారు.అయితే, ఇదేదో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో కాదు. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో జరిగిన యధార్థ సంఘటన. బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో కొండచిలువా..? అయ్యాబాబోయ్‌ అనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళితే..

విజయవాడలో కొండచిలువ ప్రత్యక్షమైంది. కనక దుర్గమ్మ కొండ కింద హెడ్ వాటర్ వర్క్స్ ఎదురుగా కొండపై నుంచి రోడ్డు పై కి వచ్చి చేరింది ఒక భారీ కొండచిలువ. చుట్టూ వాహనాల రద్దీ, ప్రజల రాకపోకలతో భయపడిపోయిన కొండచిలువ కంగారుపడింది. ఎటూ వెల్లేందుకు దారి లేక పాపం కొండచిలువ అవస్థలు పడింది. విషయం తెలిసిన అటవీశాఖ అధికారులు వచ్చి కొండచిలువను బంధించారు. రోడ్డుపై భారీగా ఏర్పడ్డ ట్రాఫిక్‌ జామ్‌ని క్లీయర్‌ చేశారు. అనంతరం ఆ పామును సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

మరోవైపు, ఉన్నట్టుండి నడిరోడ్డుపై ప్రత్యక్షమైన కొండచిలువను చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. భయపడుతూనే.. కొండచిలువను తమ మొబైల్స్‌లో వీడియోలు తీశారు. దీంతో రోడ్డుపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్