పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తజనం.. ప్రత్యేక పూజలు చేయించుకున్న ప్రజా ప్రతినిధులు..
పెద్దగట్టు జాతరలో కీలక ఘట్టమైన చంద్రపట్నం కార్యక్రమం అత్యంత ముఖ్యమైనది . ఐదో రోజు జరిగే ఊరేగింపుతో ఉత్సవాలు ముగియనున్నాయి.
పెద్దగట్టు జాతర అట్టహాసంగా కొనసాగుతోంది. లింగమంతులస్వామి దర్శనం కోసం తండోపతండాలుగా తరలివస్తున్నారు భక్తులు. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిషా నుంచి కూడా భక్తులు వస్తున్నారు. లింగమంతులస్వామిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుంటున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారం తర్వాత అధిక ప్రాధాన్యతున్న పెద్దగట్టు దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించిందన్నారు మంత్రి తలసాని.
తెలంగాణ ప్రజలందరికీ లింగమంతులస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. రెండేళ్లకోసారి జరిగే పెద్దగట్టు జాతర ఐదు రోజులపాటు సాగనుంది. రెండో రోజైన సోమవారం సౌడమ్మ, యలమంచమ్మ, ఆకు మంచమ్మ దేవతలకు బోనాలు సమర్పించారు. పెద్దగట్టు జాతరలో కీలక ఘట్టమైన చంద్రపట్నం కార్యక్రమం అత్యంత ముఖ్యమైనది . ఐదో రోజు జరిగే ఊరేగింపుతో ఉత్సవాలు ముగియనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..