AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Helicopter: నాలుగు గంటలు గాల్లో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్.. వీడియో వైరల్‌

కొన్ని సందర్భాల్లో హెలికాప్టర్లు, విమానాలు గాల్లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇలాంటి సమయంలో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం ఆందోళన కలిగిస్తుంటుంది. శత్రువు..

Helicopter: నాలుగు గంటలు గాల్లో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్.. వీడియో వైరల్‌
Helicopter
Subhash Goud
|

Updated on: Feb 07, 2023 | 5:00 AM

Share

కొన్ని సందర్భాల్లో హెలికాప్టర్లు, విమానాలు గాల్లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇలాంటి సమయంలో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం ఆందోళన కలిగిస్తుంటుంది. శత్రువు దేశాలు ఏమైనా కుట్రకు ప్లాన్‌ చేస్తున్నాయా అన్న కోణంలో కూడా అనుమానాలు వస్తుంటాయి. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలో నాలుగు గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది ఓ హెలికాప్టర్. ఎన్నడూ లేని విధంగా ఇలా చక్కర్లు కొట్టడంపై కంగారుపడిపోయారు జనం. మానవపాడు, ఉండవెల్లి మండలాల మధ్య సోమవారం నాలుగు గంటల పాటు గుర్తు తెలియని ఓ హెలికాప్టర్ పలు గ్రామాల మీదుగా చక్కర్లు కొట్టింది.

మానవపాడు మండలంలోని గోకులపాడు, చెన్నిపాడు, పోతులపాడు, ఉండవల్లి మండలంలోని ఇటిక్యాల, బోంకూర్ ఇతర గ్రామాల శివార్లలో తక్కువ ఎత్తులో ఎగురుతూ గుండ్రంగా చక్కర్లు కొట్టింది. ఉదయం 8. 30 నుంచి 1. 00 గంటల వరకు గుండ్రంగా తిరిగింది. పంట, పొలాల్లోని రైతులు, ఆయా గ్రామాల ప్రజలు ఆసక్తిగా తిలకించారు. సాంకేతిక లోపం వల్ల అలా చక్కర్లు కొట్టిందా లేక ఇతర ఏమైన కారణాలున్నాయా అనేది తేలాల్సి ఉంది. మానవపాడు పోలీసులు విచారణ చేస్తున్నారు.

అయితే ఇలా ఏకధాటిగా హెలికాప్టర్‌ గాల్లో చక్కర్లు కొట్టడంపై కొందరు ఆందోళనకు గురయ్యారు. కొందరు హెలికాప్టర్‌ చక్కర్లు కొడుతున్న వీడియోను ఫోన్‌లలో రికార్డు చేశారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌