AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అమ్మమ్మా మజాకా..! చీరకట్టుతో నదిలో డైవ్‌ చేస్తూ అదరగొట్టేసింది.. వీడియో చూశారంటే..

ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై ఓ వ్యక్తి వ్యాఖ్యానిస్తూ.. వామ్మో ఆమెంది సామీ అలా దూకేసింది..ద్యావుడా.. మనం అలాంటి ఫీట్స్‌ చేయలేం అంటూ కామెంట్‌ చేశారు.

Watch: అమ్మమ్మా మజాకా..! చీరకట్టుతో నదిలో డైవ్‌ చేస్తూ అదరగొట్టేసింది.. వీడియో చూశారంటే..
GRandmother Jumping
Jyothi Gadda
|

Updated on: Feb 06, 2023 | 8:24 PM

Share

ప్రపంచంలో ప్రతిరోజూ మనకు ఎన్నో రకాల వైరల్‌ వీడియో సోషల్ మీడియా ద్వారా చూస్తుంటాం. అందులో కొన్ని వీడియోలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇంటర్నెట్‌లో మనం చూసే వీడియోల్లో ఒక్కోసారి నవ్వించే ఎన్నో అంశాలు ఉంటాయి. కొన్నిసార్లు అవి మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి.. ఒక్కోసారి ఆశ్చర్యంగానూ ఉంటుంది.అలాంటిదే ఈ వీడియో కూడా. చీర కట్టుకున్న వృద్ధ మహిళ నదిలో డైవ్‌ చేస్తూ అందరినీ బెదరగొట్టేస్తుంది. ప్రస్తుతం ఆమె చేసిన ఫిట్ నెట్టింట వైరల్‌ అవుతోంది. తమిళనాడులోని తామిరభరణి నదిలో ఆ మహిళ దూకిన వీడియో వైరల్‌గా మారింది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను ట్వీట్ చేస్తూ, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారిణి సుప్రియా సాహు షేర్‌ చేశారు. తమరభరణి కుడి కాలువ ఒడ్డున ఉన్న కల్లిడైకురిచి వద్ద చీర ధరించిన మహిళ నదిలో దూకడం, డైవ్ చేయడం కనిపించింది. ఆమె చాలా నైపుణ్యం కలిగిన, నిష్కపటమైన ఈ మహిళలకు ఇదంతా సాధారణ వ్యవహారం అని వివరించారు. ఇది తమిళనాడు రాష్ట్రంలో అతి చిన్న నది.

ఐఏఎస్‌ అధికారిని సుప్రియా సాహు షేర్‌ చేసిన ఈ వీడియోలో తామిరపరాణి నదిలో ఓ బామ్మ తలకిందులుగా దూకింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వృద్ధాప్యం దేనికీ అడ్డంకి కాదని, వయోభారం దేనికి అడ్డంకి కాదని చెప్పే ఈ ఉత్తేజకరమైన వీడియోను పలువురు స్వాగతిస్తున్నారు. సాధారణంగా, కొంతమంది సముద్రం, నది, కొలను ఇలా ఏ ప్రదేశంలోనైనా స్నానం చేయడానికి ఇష్టపడరు. ఓ వృద్ధురాలు నదిలో స్నానం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై ఓ వ్యక్తి వ్యాఖ్యానిస్తూ.. వామ్మో ఆమెంది సామీ అలా దూకేసింది..ద్యావుడా.. మనం అలాంటి ఫీట్స్‌ చేయలేం అంటూ కామెంట్‌ చేశారు. చాలా మంది చాలా రకాలు తమ స్పందనను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.