Turkey Earthquake: టర్కీలో మరోసారి పెను భూకంపం..7.5 తీవ్రతతో రెండోసారి విధ్వంసం.. ఆ భయనక దృశ్యాలు ఇదిగో..
తుర్కియే, సిరియాలో భూకంపంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భారత్ తుర్కియేకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపింది. తుర్కియేకు వైద్య బృందాలు, మందులను పంపింది.
ప్రకృతి ప్రకోపానికి తుర్కియే, సిరియా దేశాలు అల్లకల్లోలమయ్యాయి. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది. భూకంప తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 1600 మందికి పైగా దుర్మరణం చెందగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. భూకంపం సంభవించిన ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Two earthquakes, the first one is 7,8 magnitude the second one is 7,6 according to officials, hit #Türkiye today in 9 hours and many aftershock. Death-2000+ Injured-8000+#PrayForTurkey #Syria #earthquake #turkey #deprem pic.twitter.com/mVE1hk5nU5
ఇవి కూడా చదవండి— Chaudhary Parvez (@ChaudharyParvez) February 6, 2023
సోమవారం తెల్లవారు జామున రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. టర్కీలో స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4:17 గంటలకు తొలి ప్రకంపనలు సంభవించాయి. ఆ తరువాత, మధ్యాహ్నం 1.24 గంటలకు మరోసారి భూమి కంపించింది.
Another Video- First video is emerging after a M7.8 earthquake in central Turkey.#earthquake in #Şanlıurfa#Turkey #Earthquake pic.twitter.com/9gX5XvUwak
— Chaudhary Parvez (@ChaudharyParvez) February 6, 2023
రెండోసారి సంభవించిన భూకంపంతో మరింత భారీ నష్టం సంభవించింది. పెను ప్రకంపనలు సిరియా సైతం తాకాయి. గంటల వ్యవధిలో రెండుసార్లు భూకంపం సంభవించింది. ఉదయం టర్కీ, సిరియాలో భూమి కంపించింది..వందలాది భవనాలు నేలకొరిగాయి, ఇప్పటి వరకూ 1600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారీగా మృతుల సంఖ్య పెరుగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయకచర్యలు వేగవంతం అయ్యాయి.
Another angle of Building collapses during aftershock in #Şanlıurfa, Turkey Total Death- 806 & 5097 injured.#deprem #Idlib #Syria #DEPREMOLDU #TurkeyEarthquake #Turkey pic.twitter.com/Voxrc3827E
— Chaudhary Parvez (@ChaudharyParvez) February 6, 2023
ఇదిలా ఉండగా.. తుర్కియే, సిరియాలో భూకంపంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడ్డ వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Another building collapsed in #Urfa
Update- 1700+ Killed & 6500+ injured.#deprem #DEPREMOLDU #afaddeprem #hataydeprem #kayseri #Mersin #Adana #Gaziantep #Nurdağı #Kahramanmaraş #Turkey #TurkeyEarthquake #Turquia #deprem #DepremiOldu #depremgaziantep pic.twitter.com/5fVOwOC4CK
— Chaudhary Parvez (@ChaudharyParvez) February 6, 2023
టర్కీకి అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ప్రధాని నరేంద్రమోడీ. భారత్ తుర్కియేకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపింది. తుర్కియేకు వైద్య బృందాలు, మందులను పంపింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..