ఎయిర్‌ విస్తారాకు ఎదురుదెబ్బ..! రూ. 70 లక్షల జరిమానా విధించిన డీజీసీఏ.. కారణం ఏంటంటే..

ఇదిలా ఉంటే, గత కొద్ది రోజుల క్రితం.. డిజిసిఎ ఎయిర్ ఇండియాపై రూ. 30 లక్షల జరిమానా విధించింది. విమానంలో మహిళతో అనుచితంగా ప్రవర్తించినందుకు ఎయిర్ ఇండియాకు ఈ జరిమానా విధించారు.

ఎయిర్‌ విస్తారాకు ఎదురుదెబ్బ..! రూ. 70 లక్షల జరిమానా విధించిన డీజీసీఏ.. కారణం ఏంటంటే..
Air Vistara
Follow us

|

Updated on: Feb 06, 2023 | 3:46 PM

ఎయిర్‌ విస్తారాకు ఊహించని షాక్‌ తగిలింది. ఎయిర్‌ విస్తారాకు విమానయాన సంస్థపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక చర్య తీసుకుంది. ఎయిర్ విస్తారాపై డీజీసీఏ దాదాపు 70 లక్షల జరిమానా విధించింది. దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో కనీస విమాన సర్వీసులను నిర్వహించనందుకు విమానయాన సంస్థపై DGCA ఈ పెనాల్టీని విధించింది. DGCA ప్రకారం, విస్తారా జరిమానా చెల్లించింది.

ఏప్రిల్ 2022లో నిబంధనలను పాటించనందుకు గతేడాది అక్టోబర్‌లో ఈ జరిమానా విధించారు. విమానయాన సంస్థ ఇప్పటికే జరిమానా చెల్లించిందని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయంపై విస్తారా ప్రతినిధి స్పందిస్తూ, విస్తారా గత కొన్నేళ్లుగా RDG (రూట్ డిస్పర్సల్ గైడ్‌లైన్స్)ని అనుసరిస్తోందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను గతేడాది అక్టోబర్‌లో డీజీసీఏ విమానయాన సంస్థపై జరిమానా విధించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి, ప్రతి సెక్టార్‌లో కనీస విమానాల సంఖ్య గురించి ఎయిర్‌లైన్ కంపెనీలకు దిశ నిర్దేశం చేస్తుంది డీజీసీఏ. ఈ నిబంధనపై డీజీసీఏ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది.

ఇదిలా ఉంటే, గత కొద్ది రోజుల క్రితం.. డిజిసిఎ ఎయిర్ ఇండియాపై రూ. 30 లక్షల జరిమానా విధించింది. విమానంలో మహిళతో అనుచితంగా ప్రవర్తించినందుకు ఎయిర్ ఇండియాకు ఈ జరిమానా విధించారు. దీంతో పాటు విమాన సర్వీసుల్లో ఎయిర్ ఇండియా డైరెక్టర్‌కు మూడు లక్షల రూపాయల జరిమానా విధించారు.