Viral: ఏం క్రియేటివిటీ సామీ.. ఆటోను ఏకంగా అలా మార్చేశాడు.. ఈ ఇన్వెన్షన్‌కు ఇంజినీర్లు సైతం షాకవుతారు!
దేశంలో ప్రజా రవాణా సౌకర్యాలలో ఒకటి ఆటోరిక్షాలు. చాలామంది ఆటో డ్రైవర్లు తమ త్రీ వీలర్‌ను రకరకాలుగా అలంకరించుకుంటారు..
దేశంలో ప్రజా రవాణా సౌకర్యాలలో ఒకటి ఆటోరిక్షాలు. చాలామంది ఆటో డ్రైవర్లు తమ త్రీ వీలర్‌ను రకరకాలుగా అలంకరించుకుంటారు. అలాగే అందులో మరిన్ని ఫీచర్లు ఉండేలా కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంటారు. ఈ కోవలోనే ఓ ఆటో డ్రైవర్ తన వాహనం లుక్‌ను మార్చిన తీరు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. సాధారణ ఆటోరిక్షాను విలాసవంతమైన వాహనంగా అతడు మార్చిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆటోకు రూఫ్‌లెస్ టాప్‌తో పాటు లోపల ఖరీదైన సీట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ఈ లగ్జరీ ఆటోకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నారు. ‘విజయ్ మాల్యా తక్కువ ధరలో 3 వీలర్ ట్యాక్సీని డిజైన్ చేయాల్సి వస్తే’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీనిపై ఎంతోమంది నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కొందరు రాయల్‌గా ఉందని అంటుంటే.. ‘భారతీయులు అనేక విషయాల్లో అప్‌గ్రేడ్ అయ్యారంటూ’ ఇంకొందరు కామెంట్స్ రూపంలో తెలిపారు.
కాగా, గతంలోనూ ఇలాంటి ఆటో రిక్షా డిజైన్ ఒకటి నెట్టింట వైరల్ అయింది. మే 2022లో ఢిల్లీకి చెందిన ఒక ఆటో రిక్షా డ్రైవర్ తన వాహనం పైన మొక్కలు అమర్చాడు. అప్పట్లో ఆ వీడియో వైరల్ అయింది. లోపల ఉష్ణోగ్రతను తగ్గించే క్రమంలో ఆ డ్రైవర్ ఈ విధమైన ఆలోచన చేశాడని తెలుస్తోంది.
If Vijay Mallya had to design a low cost 3 wheeler taxi @NaikAvishkar pic.twitter.com/q3pTGEV6xL
— Harsh Goenka (@hvgoenka) February 4, 2023