Trending Video: నిప్పుతో చెలగాటమాడితే ఇలాగే ఉంటది బాసూ.. ఫైర్ బ్రీతింగ్ చేయబోయి ముఖం కాల్చుకున్నాడు
ప్రస్తుతం అందరిలో సోషల్ మీడియా వినియోగం అధికంగా పెరిగిపోయింది. ఇంటర్నెట్ లో ఫేమస్ అయ్యేందుకు చాలామంది రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. బైక్ స్టంట్స్, ఫైర్ స్టంట్స్ ఇంకా అనేక రకాల సాహసాలు చేస్తుంటారు..
ప్రస్తుతం అందరిలో సోషల్ మీడియా వినియోగం అధికంగా పెరిగిపోయింది. ఇంటర్నెట్ లో ఫేమస్ అయ్యేందుకు చాలామంది రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. బైక్ స్టంట్స్, ఫైర్ స్టంట్స్ ఇంకా అనేక రకాల సాహసాలు చేస్తుంటారు. అయితే మీ అందరికీ ఫైర్ బ్రీతింగ్ అంటే తెలుసే ఉంటుంది. ఇది ఒక రకమైన సర్కస్ కళ. ఒక వ్యక్తి తన నోట్లో మండే స్వభావం కలిగిన ద్రవాన్ని నోటిలో నింపుకొని ఒక చేత్తో మంటను పట్టుకుని, ఆ మంటపైకి నోట్లోని ద్రవాన్ని ఊదుతూ గాల్లో అగ్ని గోళాలను సృష్టిస్తుంటాడు. చూసే ప్రేక్షకులకు కాస్త భయం కలిగించినా ఎంజాయ్ చేస్తారు. కానీ, ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ స్టంట్ చేస్తున్న వ్యక్తి ప్రాణాలకే ప్రమాదం. ఫైర్ బ్రీతింగ్ చేయాలంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఎంత ప్రాక్టీస్ ఉన్నా ఒక్కోసారి ఆ ప్రయత్నం బెడిసికొడుతుంది. సరిగ్గా అదే జరిగింది ఇక్కడ.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ వ్యక్తి వేదిక పైన ఫైర్ బ్రీతింగ్ స్టంట్ చేస్తున్నాడు. అతను నోటిలో మండే ద్రవం నింపుకొని చేతిలో ఉన్న మండుతున్న కాగడాపై ఉమ్మాడు. అంతే వెంటనే నోటిలో ఉన్న లిక్విడ్ కూడా మండిపోయింది. దాంతో అతని ముఖం అంతా మంటలు వ్యాపించాయి. వెంటనే చేతిలోని మంటను విసిరేసిన ఆ వ్యక్తి తన ముఖంపై మంటలను ఆర్పుకునేందుకు ప్రయత్నించాడు.
Damn bro ?? pic.twitter.com/BWzaflUrNO
— Best Videos ?? (@_BestVideos) August 8, 2022
అక్కడున్న వాళ్లు అప్రమత్తమై అతనికి సహకరించడంతో స్టంటర్‌కు ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈవీడియోను 6 వేలమందికి పైగా లైక్ చేశారు. అంతేకాదు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. కాబట్టి.. సోషల్ మీడియా పిచ్చితో ప్రమాదకర విన్యాసాలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటివి చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి