Telangana Budget 2023 Highlights: తెలంగాణ ఆచ‌రిస్తుంది.. దేశం అనుస‌రిస్తోంది.. 2023-24 బడ్జెట్‌ హైలెట్స్..

|

Updated on: Feb 06, 2023 | 1:19 PM

Telangana Budget 2023 session Highlights: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ కావడంతో.. అందరిచూపు బీఆర్ఎస్ ప్రభుత్వంపైనే ఉంది. తెలంగాణ 2022-24 వార్షిక బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉంది.

Telangana Budget 2023 Highlights: తెలంగాణ ఆచ‌రిస్తుంది.. దేశం అనుస‌రిస్తోంది.. 2023-24 బడ్జెట్‌ హైలెట్స్..
Telangana Budget 2023

Telangana Budget 2023 session Highlights: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ కావడంతో.. అందరిచూపు బీఆర్ఎస్ ప్రభుత్వంపైనే ఉంది. తెలంగాణ 2022-24 వార్షిక బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సంక్షేమ రంగానికి అధిక కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. ఆదివారం ప్రగతిభవన్‌లో సమావేశమైన కేబినెట్‌.. బడ్జెట్‌ను ఆమోదించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి బుణాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రైతుబంధు, దళితబంధు, రుణమాపీ, ఉచిత విద్యుత్‌ వంటి పథకాలకు కేటాయింపులు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. వీటికే దాదాపు 50 వేల కోట్లకుపైగా ఇవ్వాలని ప్రతిపాదనలు అందాయి.. సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాలకు భారీగానే నిధులు ఇవ్వాల్సి ఉంది. సొంత స్థలం ఉన్నవాళ్లు ఇళ్లు నిర్మించుకోవడం కోసం.. 3 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా చేరుస్తారని తెలుస్తోంది. నిరుద్యోగభృతి విషయంలో ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇవాళ ఉదయం 10.30కు అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు, శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెడతారు.

సాధారణంగా బడ్జెట్‌ సమావేశాలు మార్చ్‌లో పెడుతారు. కానీ ఈసారి మాత్రం ఫిబ్రవరి రెండో వారంలో సమావేశాలు ముగుస్తున్నాయి. అంటే బడ్జెట్‌ ఆమోదం పొందిన 47 రోజుల వరకూ పాత పద్దే అమల్లో ఉంటుంది. ఏప్రిల్‌-1 తర్వాత కొత్త బడ్జెట్ అమల్లోకి వస్తుంది. పద్దుల అధ్యయనం కోసం 7వ తేదీ సభకు సెలవు ఇచ్చారు. 8న బడ్జెట్‌ పద్దులపై చర్చఉంటుంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Feb 2023 12:48 PM (IST)

    తెలంగాణ బడ్జెట్..

    Telangana Budget

    Telangana Budget

  • 06 Feb 2023 12:47 PM (IST)

    తెలంగాణ బడ్జెట్ హైలెట్స్

    Telangana Budget 2023

    Telangana Budget 2023

  • 06 Feb 2023 12:36 PM (IST)

    కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

    కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు బడ్జెట్‌లో తీపికబురు అందించారు ఆర్థిక మంత్రి హరీష్‌రావు. ఏప్రిల్‌ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు. సెర్ఫ్ ఉద్యోగుల పే స్కెల్‌ను సవరిస్తామని చెప్పారు.

  • 06 Feb 2023 12:18 PM (IST)

    ముగిసిన హరీష్ రావు ప్రసంగం..

    తెలంగాణ బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. దీని తర్వాత అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది.

  • 06 Feb 2023 12:00 PM (IST)

    జర్నలిస్టులు, న్యాయవాదుల సంక్షేమం కోసం భారీగా కేటాయింపులు..

    జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.100కోట్ల నిధిని కార్పస్‌ ఫండ్‌కు కేటాయించింది.

    రూ.15కోట్ల నిర్మిస్తున్న మీడియా అకాడమీ భవన నిర్మాణం తుది దశకు చేరుకుందని హరిష్ రావు తెలిపారు.

    న్యాయవాదుల సంక్షేమం కోసం కూడా రూ.100కోట్ల నిధిని సమకూర్చినట్లు మంత్రి తెలిపారు.

  • 06 Feb 2023 11:57 AM (IST)

    విద్యాశాఖకు రూ.19,093 కోట్లు..

    రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని.. మంత్రి హరిష్ రావు పేర్కొన్నారు. ‘మన ఊరు మన బడి’ ద్వారా పాఠశాలల అభివృద్ధి, యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పన, ఆంగ్ల మాధ్యమంలో బోధన లాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందన్నారు. విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. విద్యాశాఖ కోసం ఈ బడ్జెట్‌లో రూ.19,093కోట్లు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు.

  • 06 Feb 2023 11:34 AM (IST)

    హైదరాబాద్ మెట్రోకు భారీగా కేటాయింపులు..

    • మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ కోసం రూ.1,500 కోట్లు
    • ఎయిర్‌పోర్టు మెట్రో కనెక్టివిటీ కోసం రూ.500 కోట్లు
    • ఓల్డ్‌ సిటీలో మెట్రో కనెక్టివిటీ కోసం రూ.500 కోట్లు
  • 06 Feb 2023 11:33 AM (IST)

    ఎన్నికల ఏడాదిలో నియోజకవర్గాలకు నిధుల వరద

    ఎన్నికల ఏడాదిలో నియోజకవర్గాలకు భారీగా నిధులు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్పెషల్‌ డెవలప్‌ఫండ్‌ను భారీగా పెంచింది. గత ఏడాది రూ.2 వేల కోట్లు, ఇప్పుడు రూ.10,348 కోట్లు కేటాయించింది. సంక్షేమానికి పెద్దపీట వేసిన తెలంగాణ పద్దు.. గ్రామాల అభివృద్ధికి కేటాయింపులు భారీగా పెంచింది. పల్లె ప్రగతి, పంచాయతీరాజ్‌ శాఖకు ఏకంగా 31,426 కోట్లు కేటాయించింది. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ 3,210 కోట్లు కేటాయింపులు జరిపింది.

  • 06 Feb 2023 11:27 AM (IST)

    గిరిజన సంక్షేమం కోసం రూ.15,233కోట్లు

    గిరిజన సంక్షేమం కోసం షెడ్యూల్‌ తెగల ప్రత్యేక నిధి కింద రూ.15,233కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు.

  • 06 Feb 2023 11:26 AM (IST)

    షెడ్యూల్‌ కులాల ప్రత్యేక ప్రగతికి రూ.36,750

    షెడ్యూల్‌ కులాలు, తెగల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ బడ్జెట్‌లో షెడ్యూలు కులాల ప్రత్యేక ప్రగతి నిధి కింద రూ.36,750 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ కింద రూ.20లక్షల ఆర్థికసాయాన్ని అందిస్తున్నామన్నారు.

  • 06 Feb 2023 11:20 AM (IST)

    వైద్యఆరోగ్య శాఖకు 12,161కోట్లు

    • మైనార్టీ సంక్షేమశాఖకు 2200కోట్లు
    • వైద్యఆరోగ్య శాఖకు 12,161కోట్లు
    • మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ కోసం 11371కోట్లు
    • హోంశాఖకు 9599 కోట్లు
  • 06 Feb 2023 11:14 AM (IST)

    హైదరాబాద్ మెట్రోకు- 1500 కోట్లు

    • పంచాయతీ రాజ్ - 2587 కోట్లు
    • హైదరాబాద్ మెట్రోకు- 1500 కోట్లు
    • గొర్రెల పెంపపం కోసం రూ.100 కోట్లు
  • 06 Feb 2023 11:12 AM (IST)

    రుణమాఫీ కోసం 6385 కోట్లు

    • బీసీ సంక్షేమ శాఖకు 6229 కోట్లు
    • రుణమాఫీ కోసం - 6385 కోట్లు
    • రైతు బంధు - 1575 కోట్లు
    • రైతు భీమా - 1589 కోట్లు
    • విద్యుత్ సబ్సిడీ - 12000 కోట్లు
    • కల్యాణలక్ష్మి - 2000 కోట్లు
    • బియ్యం సబ్సిడీ - 2000 కోట్లు
    • కెసీఆర్ కిట్ - 200 కోట్లు
    • ఆసరా పెన్షన్లు - 12000 కోట్లు
    • స్కాలర్షిప్‌ల కోసం - 5609 కోట్లు
    • పల్లె ప్రగతి పట్టణ ప్రగతి - 4834 కోట్లు
    • డబుల్ బెడ్‌రూమ్‌ల కోసం- 12000 కోట్లు
    • ఆరోగ్యశ్రీ - 1463 కోట్లు
    • SDF - 10348 కోట్లు
    • CDP - 800 కోట్లు
    • ఇరిగేషన్ - 10014 కోట్లు
  • 06 Feb 2023 10:57 AM (IST)

    దళిత బంధు కోసం రూ.17,700 కోట్లు..

    • ఆసరా ఫించన్ల కోసం రూ.12వేల కోట్లు
    • దళిత బంధు కోసం రూ.17,700 కోట్లు
    • ఎస్పీ ప్రత్యేక నిధి కోసం రూ.36,750 కోట్లు
    • ఎస్టీ ప్రత్యేక నిధి కోసం రూ.15,233కోట్లు
    • బీసీ సంక్షేమం కోసం రూ.6,229 కోట్లు
    • మహిళా, శిశు సంక్షేమం కోసం రూ.2,131కోట్లు
    • గ్రామాల్లో రోడ్ల కోసం 2వేల కోట్లు..
    • ఆర్ అండ్ బీ రోడ్ల కోసం 2,500 కోట్లు
  • 06 Feb 2023 10:51 AM (IST)

    వ్య‌వ‌సాయానికి, నీటిపారుద‌ల రంగానికి భారీగా కేటాయింపులు

    • వ్య‌వ‌సాయరంగానికి కేటాయింపులు రూ. 26,831 కోట్లు.
    • నీటిపారుద‌ల శాఖ‌కు రూ. 26,885 కోట్లు.
    • విద్యుత్ కేటాయింపులు రూ. 12,727 కోట్లు.
  • 06 Feb 2023 10:47 AM (IST)

    దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ..

    బడ్జెట్ లో వ్యవసాయ శాఖకు రూ.26,831 కోట్లు కేటాయించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.

  • 06 Feb 2023 10:43 AM (IST)

    2023 - 24 బడ్జెట్ 2,90,396 కోట్లు..

    తెలంగాణ బడ్జెట్‌ను మంత్రి హరీష్ రావు ప్రవేశపెడుతున్నారు. 2023 - 24 బడ్జెట్ 2,90,396 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

    • తెలంగాణ 2023 - 24 వార్షిక బడ్జెట్ 2,90,396 కోట్లు
    • తలసరి ఆదాయం3,17,215
    • మూలధన వ్యయం 37, 525 కోట్లు
  • 06 Feb 2023 10:36 AM (IST)

    బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి హరీష్ రావు..

    దేశంలో అత్యధికంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

  • 06 Feb 2023 10:33 AM (IST)

    హరీష్ రావు ప్రసంగం ప్రారంభం..

    శాసనసభలో మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది.. అని హరీష్ తెలిపారు.

  • 06 Feb 2023 10:29 AM (IST)

    సీఎం కేసీఆర్ కు బడ్జెట్ ప్రతులను అందజేసిన మంత్రులు..

    మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి వరుసగా నాలుగోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రతులను అందజేశారు.

  • 06 Feb 2023 10:25 AM (IST)

    శాసన సభలో హరీష్ రావు, శాసనమండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి

    శాసన సభలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు, శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మరికాసేపట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

  • 06 Feb 2023 10:24 AM (IST)

    సీఎం కేసీఆర్ కు మంత్రుల పాదాభివందనం..

    బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ కు మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి పాదభివందనం చేసి ఆశిస్సులు తీసుకున్నారు.

  • 06 Feb 2023 10:17 AM (IST)

    టీటీడీ ఆలయంలో పూజలు

    అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మంత్రి హరీష్ రావు జూబ్లీహిల్స్‌లోని టీటీడీ ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. బడ్జెట్‌ కాపీలతో వెంకటేశ్వరస్వామి సన్నిధికి చేరుకుని హరీష్‌రావు పూజలు చేశారు.

  • 06 Feb 2023 10:16 AM (IST)

    తెలంగాణ మోడల్‌పై చర్చ

    తెలంగాణ మోడల్‌పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికి మోడల్‌గా నిలిచాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు అన్న మంత్రి.. ఆ క్రమంలో బడ్జెట్ ఉంటుందన్నారు. కేంద్రం తెలంగాణపై చిన్నచూపు చూస్తోందని బడ్జెట్ ప్రవేశపెట్టేముందు మాట్లాడారు.

  • 06 Feb 2023 10:13 AM (IST)

    సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా బడ్జెట్‌

    కాసేపట్లో హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ఈ బడ్జెట్‌ ఉంటుందని హరీష్‌రావు క్లారిటీ ఇచ్చారు.

    • బడ్జెట్‌పై భారీ ఆశలు, అంచనాలు
    • సంక్షేమం.. అభివృద్ధే లక్ష్యం..
    • ఈసారి బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు ఉంటుందని అంచనా
    • ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్
    • బడ్జెట్‌పై భారీ ఆశలు, అంచనాలు
    • ఎన్నికల తాయిలాలు ఉంటాయా? రైతులకు వరాలు కురిపిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
  • 06 Feb 2023 09:59 AM (IST)

    ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా బడ్జెట్.. హరీశ్ రావు..

    తెలంగాణ బడ్జెట్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉంటుందని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

    • కేసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్
    • సంక్షేమానికి అభివృద్ధి రెండు జొడేద్దుల్లగా సమపాళ్లలో ఉండబోతోంది.
    • కేంద్రం నుండి వివక్ష కొనసాగుతుంటే, ఒక్క రూపాయి కూడా కేంద్రం నుండి రాకపోయినా అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ముందుకెళ్తోంది.
    • సంక్షేమ పథకాలు ఆగకూడదన్న కెసీఆర్ ఆలోచనతో బడ్జెట్ కేటాయింపులు చేశాం
    • తెలంగాణ మోడల్ దేశం అవలంభిస్తోంది
    • దేశానికి రోల్ మోడల్ తెలంగాణ నిలిచింది
    • సభలో నేను, మండలి లో ప్రశాంత్ రెడ్డి ప్రవేశ పెడుతారు
    • బడ్జెట్ నిన్న కేబినేట్ ఆమోదంతో పాటు గవర్నర్ ఆమోదం కూడా లభించింది
    • ఉదయం 10.30 కు బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నాం
  • 06 Feb 2023 09:57 AM (IST)

    అసెంబ్లీకి చేరుకున్న ఆర్థిక మంత్రి హరీశ్ రావు..

    తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా హరీశ్ రావు అసెంబ్లీకి చేరుకున్నారు.

Published On - Feb 06,2023 9:52 AM

Follow us