బ్యాగ్ నిండా ఫారిన్ కరెన్సీ ఉందనగానే నమ్మాడు.. తీరా ఓపెన్ చేసి చూస్తే ఊహించని షాక్..

విదేశీ కరెన్సీ అంటూ కటింగ్ ఇచ్చాడు.. బ్యాగులో అంతా ఇంగ్లీష్‌ పేపర్లే..! ఓ వ్యక్తిని నమ్మించి ఐదు లక్షలకు టోకరా వేశాడు కేటుగాడు. స్టోరీ రివర్స్‌ కావడంతో అడ్డంగా బుక్కయ్యారు.

బ్యాగ్ నిండా ఫారిన్ కరెన్సీ ఉందనగానే నమ్మాడు.. తీరా ఓపెన్ చేసి చూస్తే ఊహించని షాక్..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 06, 2023 | 9:38 AM

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో విదేశీ కరెన్సీ పేరుతో ఓ వ్యక్తి ఘోరంగా మోసపోయాడు. మహబూబ్‌నగర్‌ టౌన్‌లో ఆఫ్టికల్ షాప్‌ నిర్వహించే సిరాజ్‌ దగ్గరకు ఓ వ్యక్తి వచ్చాడు. తన వద్ద లక్షల్లో విలువైన విదేశీ కరెన్సీ ఉందని, అది మీ దగ్గర చెల్లుబాటు అవుతుందా అని ప్రశ్నించాడు. దాంతో సిరాజ్‌ చెల్లుబాటు అవుతుందని చెప్పాడు. తన దగ్గర 16వేల దిర్హాం ఉందని చెప్పడంతో వాటిని తీసుకోవాలని ఆఫ్టికల్ షాప్‌ యాజమాని సిరాజ్‌ ఆశపడ్డారు. విదేశీ కరెన్సీ విలువ మార్కెట్లో సుమారు 35 లక్షల రూపాయలు ఉంటుందని తెలుసుకున్న సిరాజ్‌.. 10 లక్షలకు బేరం కుదుర్చుకుని జడ్చర్లకు వచ్చాడు.

జడ్చర్లలోని త్రిశూల్‌నగర్‌ దగ్గర ఐదు లక్షల రూపాయలు తీసుకొని, విదేశీ కరెన్సీ ఉన్న బ్యాగును సిరాజ్‌కు ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత సిరాజ్‌ బ్యాగులో చూడగా, అన్నీ ఇంగ్లీష్‌ న్యూస్‌ పేపర్స్‌ ఉండటం చూసి షాకయ్యారు. తాము మోసం పోయామని తెలుసుకున్ సిరాజ్‌, వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. స్పాట్‌కు వచ్చిన పోలీసులు ఘటనపై ఆరా తీశారు.

పోలీసులు కేసు నమోదు చేసి, బ్యాగ్‌ ఇచ్చి పారిపోయిన వ్యక్తులకోసం గాలిస్తున్నారు. అత్యాశకు పోయి ఎవరు కూడా ఇలాంటి మోసాలకు గురికావొద్దని స్థానికి ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌బాబు సూచించారు. ఈ కేసును సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..