Parents Temple: దివంగతులైన తల్లిదండ్రుల కోసం కొడుకులు చేసిన పనికి అంతా షాక్..! వీడియో.

Parents Temple: దివంగతులైన తల్లిదండ్రుల కోసం కొడుకులు చేసిన పనికి అంతా షాక్..! వీడియో.

Anil kumar poka

|

Updated on: Feb 06, 2023 | 8:36 AM

కన్న తల్లిదండ్రులను.. బతికుండగానే నిర్లక్ష్యంగా వదిలేస్తున్న ఈ రోజుల్లో.. తల్లిదండ్రులను తాము బతికినంత కాలం కళ్లెదుటే నిలుపుకునే విధంగా.. తల్లిదండ్రులకు పుత్రులు గుడి కట్టించారు...

కన్న తల్లిదండ్రులను.. బతికుండగానే నిర్లక్ష్యంగా వదిలేస్తున్న ఈ రోజుల్లో.. తల్లిదండ్రులను తాము బతికినంత కాలం కళ్లెదుటే నిలుపుకునే విధంగా.. తల్లిదండ్రులకు పుత్రులు గుడి కట్టించారు. ఈ అరుదైన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి శివారు జామ్లా తండాలో చోటుచేసుకుంది. కోమటిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గుగులోతు జామ్లా నాయక్ గత ఏడాది జనవరి 30న మృతి చెందారు.. అదే ఏడాది ఆగస్టు 17న జామ్లా నాయక్ సతీమణి బుగ్గి మరణించింది. జామ్లా నాయక్, బుగ్గి దంపతుల కుమారులు ఖీమా నాయక్, భీమా నాయక్, లింభా నాయక్, వాగ్యానాయక్ తమ తల్లిదండ్రులు దివంగతులై ఏడాది గడిచిన నేపథ్యంలో తల్లిదండ్రుల విగ్రహాలతో గుడి కట్టించాలని నిర్ణయించారు. ఆ మేరకు లక్షన్నర వ్యయంతో తండా ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న స్థలంలో జామ్లా నాయక్, బుగ్గి శిలా విగ్రహాలను ఏర్పాటు చేసి గుడి కట్టించారు. తమ తల్లిదండ్రుల విగ్రహాలతో తాము బతికున్నంత కాలం కళ్లేదుటే వారు ఉన్నట్టుగా భావిస్తున్నట్లు కుమారులు తెలిపారు. తాతా నాయనమ్మ విగ్రహాల ఏర్పాటుకు మనవడు మహేందర్ దగ్గరుండి ఏర్పాట్లు పూర్తి చేసి నాన్న, పెద్దనాన్న, చిన్నాన్నల ఆకాంక్షను నెరవేర్చినట్లు చెప్పారు. జామ్లా నాయక్, బుగ్గి దంపతుల విగ్రహాలతో ఏర్పాటు చేసిన గుడిని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి ప్రారంభించారు. బతికుండగానే తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు ఉన్న సమాజంలో చనిపోయిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టుకొని నిలుపుకునే ఇలాంటి కొడుకులు ఉండటం ఎంతో అదృష్టం అని భరత్ చందర్ రెడ్డి అన్నారు. దివంగత జామ్లా నాయక్, బుగ్గి శిలా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 06, 2023 08:36 AM