Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Feb 03, 2023 | 8:09 AM

ఇటీవల భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలకు కూడా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇద్దరూ సహనం కోల్పోయి తీవ్రంగా ప్రవర్తిస్తున్నారు. ఒకరినొకరు ప్రాణాలు తీసుకునేంతవరకూ వెళ్తున్నారు.


భర్త ఆగడాలు భరించలేక ఓ భార్య తన భర్త నాలుకను కొరికివేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. లక్నో జిల్లాకు చెందిన మున్నా, సల్మాకు మూడేళ్ల క్రితం పెళ్లయింది. ఈ దంపతులు మధ్య విభేదాలు తలెత్తడంతో ఏడాది కాలంగా విడివిడిగా ఉంటున్నారు. సల్మా పిల్లలతో కలిసి తన పుట్టింట్లో ఉంటోంది. ఆటో డ్రైవర్‌ అయిన మున్నా జనవరి 27న తన పిల్లలను కలిసేందుకు ఠాకూర్‌గంజ్ రాధాగ్రామ్ ప్రాంతంలోని భార్య ఇంటికి వెళ్లాడు. మద్యం సేవించి ఉన్న భర్తను ఆ సమయంలో తమ బిడ్డను కలవడానికి వీల్లేదంటూ అడ్డుకుంది సల్మా. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని అదనపు డిసిపి చిరంజీవ్ సిన్హా తెలిపారు. ఈ క్రమంలో కోపోద్రిక్తురాలైన భార్య.. భర్త నాలుకను నోటితో కొరికింది. దీంతో తీవ్రంగా గాయపడిన మున్నా స్పృహ తప్పి పోయాడు. తీవ్ర రక్తస్రావమైందని పోలీసులు తెలిపారు. బాధితుడిని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ ట్రామా సెంటర్‌కు తరలించామన్నారు. మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu