Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్ చూసి వైద్యులు షాక్.
ఓ 34 ఏళ్ల యువకుడు విపరీతమైన కడుపునొప్పి, వికారం, వాంతులతో ఇబ్బంది పడుతూ, వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చాడు. కడుపునొప్పి కారణంగా అతను ఆహారంగానీ, నీళ్లుగానీ తీసుకోలేకపోతున్నాడు..
ఓ 34 ఏళ్ల యువకుడు విపరీతమైన కడుపునొప్పి, వికారం, వాంతులతో ఇబ్బంది పడుతూ, వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చాడు. కడుపునొప్పి కారణంగా అతను ఆహారంగానీ, నీళ్లుగానీ తీసుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లగా అతనికి సీటీ స్కాన్ చేసిన వైద్యులు రిపోర్ట్ చూసి ఖంగుతిన్నారు. అతడి కడుపులో కండోమ్‌తో చుట్టబడిన అరటిపండును గుర్తించారు డాక్టర్లు. దాని కారణంగానే అతడికి ఈ సమస్యలు వచ్చాయి. రోగి డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా, అతని శరీరంలో హార్మోన్ల సమతుల్యత కూడా దెబ్బతింది. ఈ రెండు సమస్యల కారణంగా ఆ యువకుడు ఈ పని చేసినట్లు కనుగొన్నారు. వెంటనే వైద్యులు శస్త్రచికిత్సచేసి దాన్ని బయటకు తీశారు. అనంతరం అతడి కడుపు నుంచి బయటకు తీసిన.. కండోమ్‌తో చుట్టుబడిన అరటిపండు చిత్రాలను షేర్ చేశారు. ఆపరేషన్ అనంతరం 3 రోజుల తర్వాత బాధితుడ్ని డిశ్చార్జ్ చేశారు. కానీ ఆ వ్యక్తి ఇప్పటికీ తినడానికి, మలవిసర్జన చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. రోగి సాధారణ జీవితం గడపడానికి ఆరు నెలల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. కండోమ్‌లో అరటిపండు పెట్టి మింగిన కేసు ఇదే తొలిసారి అని తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను “క్యూరిస్” జర్నల్‌లో ప్రచురించారు. మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసేందుకు.. మత్తుపదార్థాలను కండోమ్‌లో నింపి కడుపులో దాచిన సందర్భాలు చూశాం కానీ.. ఇలా మింగిన ఘటన ఇప్పటివరకు చూడలేదని వైద్యులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

