Bull video: శివుని ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న ఎద్దు.. లెక్కకు తగ్గకుండా 108 ప్రదక్షిణలు..
దేవదేవుడైన పరమేశ్వరుడికి పరమభక్తుడు నందీశ్వరుడు. ఆయన ఎద్దు రూపంలో ఉంటారు. అందుకే ఆయనను బసవయ్య, నంది ఇలా పలు పేర్లతో పిలుస్తారు. ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్న ఎద్దు కూడా
దేవదేవుడైన పరమేశ్వరుడికి పరమభక్తుడు నందీశ్వరుడు. ఆయన ఎద్దు రూపంలో ఉంటారు. అందుకే ఆయనను బసవయ్య, నంది ఇలా పలు పేర్లతో పిలుస్తారు. ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్న ఎద్దు కూడా నందీశ్వరుడికి ఏమాత్రం తీసిపోదు. అవును యూపీలోని ఓ చిన్న శివాలయానికి రోజూ నిర్ణీత సమయానికి వచ్చి..ఈ ఎద్దు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ప్రతి రోజూ లెక్కకు ఎక్కువ తక్కువ కాకుండా ఖచ్చితంగా 108 ప్రదక్షిణలు చేస్తుందట. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుందటున్నారు స్థానికులు. ఎద్దు ఎలా లెక్కపెడుతుందన్నదని అందరూ ఆశ్ఛర్యం వ్యక్తం చేస్తున్నారు. గుడి చుట్టూ ఎద్దు ప్రదక్షిణలు చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో, మహిళలు కూడా ఆలయం లోపల శివుడిని పూజిస్తున్నారు. ఎవరిని పట్టించుకోకుండా.. తనకు ఎవరితోనూ పనిలేదు అన్నట్లు.. కేవలం శివయ్య మాత్రమే ముఖ్యం అన్నట్లుగా శివభక్తిలో నిమగ్నమై ఎద్దు గుడి చుట్టూ ప్రదక్షణలు చేస్తోంది.
వాస్తవానికి ఈ వీడియో పాతదిగా తెలుస్తోంది. అయినా సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది.ఇలాంటి శివ భక్తుడిని మీరు చూసి ఉండరు. ఈ ఎద్దును నిజమైన శివ భక్తుడు అని అంటున్నారు నెటిజన్లు..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..