Harish Rao: ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం.. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మంత్రి హరీశ్ కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ మోడల్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికి మోడల్‌గా నిలిచాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు అన్న మంత్రి.. ఆ క్రమంలో...

Harish Rao: ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం.. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మంత్రి హరీశ్ కీలక వ్యాఖ్యలు..
Telangana Minister Harish Rao
Follow us

|

Updated on: Feb 06, 2023 | 10:11 AM

తెలంగాణ మోడల్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికి మోడల్‌గా నిలిచాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు అన్న మంత్రి.. ఆ క్రమంలో బడ్జెట్ ఉంటుందన్నారు. కేంద్రం తెలంగాణపై చిన్నచూపు చూస్తోందని ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని టీటీడీ ఆలయానికి మంత్రి హరీశ్ రావు.. బడ్జెట్‌ కాపీలతో వెళ్లారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి ఆలయం నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లి పదిన్నర గంటలకు సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాబోతున్న బడ్జెట్‌ ఎలా ఉంటుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

కాగా.. అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో మంత్రి వేముల బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ సారి బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల ముందు చివరి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్‌పై భారీ ఆశలు, అంచనాలు ఉంటాయని తెలుస్తోంది. ఎన్నికల తాయిలాలు ఉంటాయా? రైతులకు వరాలు కురిపిస్తారా? అనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా బడ్జెట్‌ ఉంటుందని మంత్రి హరీశ్ రావు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!