- Telugu News Photo Gallery Political photos Lokesh yuvagalam padayatra reached 100 km on 10th day photos and headlines Telugu Political Photos
Nara Lokesh: 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర.. ఫొటోలు..
టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వంద కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పాదయాత్రలో నారా లోకేష్ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు.
Anil kumar poka | Edited By: Shaik Madar Saheb
Updated on: Feb 06, 2023 | 9:56 AM

లోకేశ్ పాదయాత్ర 10వ రోజున పలు ఆసక్తికర అంశాలుపూతలపట్టు నుంచి చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించిన పాదయాత్ర

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు నేడు 10వ రోజు. ఇవాళ లోకేశ్ పూతలపట్టు నియోజకవర్గంలో 13.5 కిలోమీటర్లు నడిచారు.

ఇవాళ్టి పాదయాత్రలో పూతలపట్టు నియోజకవర్గం నుంచి నారా లోకేశ్ పాదయాత్ర చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించింది.

పాదయాత్ర 100 కిమీ పూర్తయిన సందర్భంగా లోకేశ్ తో భారీ కేకు కోయించిన మారేడుపల్లి యువకులు

కాణిపాకంలో పూల తివాచీ పరిచిన గ్రామస్తులు. పువ్వులతో లోకేశ్ కు స్వాగతం

కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో లోకేశ్ ప్రత్యేక పూజలు

లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ

నడుస్తూ తూలిపడిపోయిన కొనకళ్ల... చేయందించి పైకి లేపి, ఆయన ప్యాంటుకు అంటిన మట్టిని తుడిచిన లోకేశ్

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైద్యరంగాన్ని నిర్వీర్యం చేసిందన్న లోకేశ్

గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ పారామెడిక్స్ సేవలు వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వెల్లడి

అధికారంలోకి వచ్చిన వెంటనే కమ్యూనిటీ పారామెడిక్స్ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ

అధికారంలోకి వచ్చిన 3నెలల్లో ముస్లింలపై అక్రమకేసుల మాఫీ!

దుల్హన్, మైనార్టీ కార్పొరేషన్, విదేశీ విద్యను మళ్లీ తీసుకొస్తామని వెల్లడి.





























