Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు.. సీబీఐ దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్..

తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సింగల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ ను సమర్ధించిన డివిజన్ బెంజ్.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో దర్యాప్తు చేపించాలని ఆదేశాలు...

Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు.. సీబీఐ దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్..
Telangana High CourtImage Credit source: TV9 Telugu
Follow us

|

Updated on: Feb 06, 2023 | 11:22 AM

తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సింగల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ ను సమర్ధించిన డివిజన్ బెంజ్.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో దర్యాప్తు చేపించాలని ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలో ఏర్పడింది. సీబీఐతో విచారణకు గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాలపై తెలంగాణ సర్కార్.. డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. సీబీఐ విచారణకే మొగ్గు చూపింది. ఈ కేసులో జనవరి 18న చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ తీర్పును రిజర్వ్‌ చేశారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు వెళ్లేందుకు అడ్వకేట్ జనరల్ కొంత సమయం అడిగారు. అప్పటి వరకు ఆర్డర్ సస్పెండ్ లో ఉంచాలని కోరారు. అయితే ఆర్డర్ సస్పెన్షన్ కు హైకోర్టు నిరాకరించింది.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎటువంటి మనీలాండరింగ్‌ జరగనప్పటికీ ఈడీ కేసు నమోదు చేయడం చెల్లదని ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌కు సమాధానం ఇవ్వడానికి సమయం ఇవ్వాలని రోహిత్‌రెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేయడంతో.. విచారణ ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.

కాగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. మోయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో కొందరు వ్యక్తులు.. తమను ప్రలోభపెట్టారన్న వ్యాఖ్యలు కలకలం రేపాయి. డబ్బు ఆశ చూపారని, పార్టీ మారేందుకు ఒత్తిడి చేశారని వివరించారు. దీంతో ఈ కేసు పలు మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతి పొందింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..