AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister: తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లు.. మేం ఆచరిస్తే వాళ్లు అనుసరిస్తున్నారు.. మంత్రి హరీశ్

తెలంగాణ బడ్జెట్ లో రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వ్య‌వ‌సాయానికి, నీటిపారుద‌ల రంగం, వాటి అనుబంధ రంగాలకు భారీగా కేటాయింపులు ఇచ్చారు. వ్య‌వ‌సాయరంగానికి రూ. 26,831 కోట్లు, నీటిపారుద‌ల శాఖ‌కు..

Minister: తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లు.. మేం ఆచరిస్తే వాళ్లు అనుసరిస్తున్నారు.. మంత్రి హరీశ్
Minister Harish Rao
Ganesh Mudavath
|

Updated on: Feb 06, 2023 | 11:19 AM

Share

తెలంగాణ బడ్జెట్ లో రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వ్య‌వ‌సాయానికి, నీటిపారుద‌ల రంగం, వాటి అనుబంధ రంగాలకు భారీగా కేటాయింపులు ఇచ్చారు. వ్య‌వ‌సాయరంగానికి రూ. 26,831 కోట్లు, నీటిపారుద‌ల శాఖ‌కు రూ. 26,885 కోట్లు, విద్యుత్ కేటాయింపులు రూ. 12,727 కోట్లు కేటాయించినట్లు మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ మారిందని కొనియాడారు. 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,90,396 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తెలంగాణలో తలసరి ఆదాయం రూ.3,17,215 ఉందన్న మంత్రి హరీశ్.. మూలధన వ్యయం రూ.37,525 కోట్లు ఉందన్నారు. దేశంలో అత్యధికంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది.. అని హరీశ్ అన్నారు. మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి వరుసగా నాలుగోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రతులను అందజేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ కావడంతో.. అందరిచూపు బీఆర్ఎస్ ప్రభుత్వంపైనే ఉంది.

దళిత బంధు కోసం రూ.17,700 కోట్లు, ఆసరా ఫించన్ల కోసం రూ.12వేల కోట్లు, ఎస్పీ ప్రత్యేక నిధి కోసం రూ.36,750 కోట్లు, ఎస్టీ ప్రత్యేక నిధి కోసం రూ.15,233కోట్లు, బీసీ సంక్షేమం కోసం రూ.6,229 కోట్లు, మహిళా, శిశు సంక్షేమం కోసం రూ.2,131కోట్లు, గ్రామాల్లో రోడ్ల కోసం రూ.2వేల కోట్లు, ఆర్ అండ్ బీ రోడ్ల కోసం 2,500 కోట్లను బడ్జెట్ లో కేటాయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..