Earthquakes: టర్కీ, సిరియా భూకంప విపత్తును అతడు మూడు రోజుల ముందే ఊహించాడు..! ట్విట్ వైరల్
భూకంపం కారణంగా టర్కీ, సిరియా సరిహద్దుల్లోని నివాస భవనాలు నేలమట్టమయ్యాయి. 24 గంటల్లో వరుసగా మూడుసార్లు భూకంపం సంభవించింది. వరుస భూకంపాలతో ఆ దేశం అస్తవ్యస్థంగా మారింది.
టర్కీ, సిరియాలో సంభవించిన భయంకర భూకంపాలకు సంబంధించి నెదర్లాండ్స్‌కు చెందిన ఒక వ్యక్తి మూడు రోజుల ముందుగానే ఈ విషయాన్ని ఊహించాడు. గత డిసెంబర్‌లో భూకంప శాస్త్రవేత్త దీనిని అంచనా వేసినట్టుగా టర్కీకి చెందిన ఒక వార్తా ప్రకటించింది. అంతేకాదు.. నెదర్లాండ్స్‌కు చెందిన బ్రాగ్ హూగర్‌బీట్ అనే మరో భూగర్భ శాస్త్రవేత్త కూడా ఈ భూకంపాన్ని సరిగ్గా మూడు రోజుల ముందు, అంటే ఫిబ్రవరి 3న అంచనా వేశారు. దీనిపై ఆయన ట్విట్టర్‌లో రాస్తూ.. ‘మిడిల్ ఈస్ట్ టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్‌లలో త్వరలో 7.5 తీవ్రతతో భూకంపం రానుంది. భూకంపం సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాన్ని చూపించే మ్యాప్‌ను కూడా తన ట్వీట్‌తో జత చేశాడు. ప్రస్తుతం అతడు చేసిన ట్విట్ ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది.
టర్కీలోని గాజియాంటెప్ ప్రావిన్స్‌లోని నుర్తకీ నగరానికి 23 కిలోమీటర్ల దూరంలో స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 04:17 గంటలకు దాదాపు 17.9 కిలోమీటర్ల (11 మైళ్లు) లోతులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8గా భూకంప తీవ్రత నమోదైంది. భూకంపం సంభవించిన 15 నిమిషాల తర్వాత మరో 6.7 భూప్రకంపనలు సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం కారణంగా టర్కీ, సిరియా సరిహద్దుల్లోని నివాస భవనాలు నేలమట్టమయ్యాయి. దీని కారణంగా 24 గంటల్లో ఎల్బిటాన్‌లో మరో 7.6 రిక్టర్‌తో భూకంపం సంభవించగా దేశం అస్తవ్యస్థంగా మారింది.
Sooner or later there will be a ~M 7.5 #earthquake in this region (South-Central Turkey, Jordan, Syria, Lebanon). #deprem pic.twitter.com/6CcSnjJmCV
— Frank Hoogerbeets (@hogrbe) February 3, 2023
తాజా నివేదికల ప్రకారం, టర్కీ,సిరియాలో భూకంపం కారణంగా దాదాపు 1600 మందికి పైగా మరణించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..