అసలెలా ఆమెను జడ్జిగా నియమిస్తారంటూ సుప్రీంకోర్టుకెక్కిన లాయర్లు.. దేశవ్యాప్తంగా రచ్చ రచ్చ..

సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుపైనా మండిపడుతున్నారు కొందరు. గతంలో బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన విక్టోరియా గౌరి... ముస్లింలు, క్రైస్తవులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తుచేస్తున్నారు.

అసలెలా ఆమెను జడ్జిగా నియమిస్తారంటూ సుప్రీంకోర్టుకెక్కిన లాయర్లు.. దేశవ్యాప్తంగా రచ్చ రచ్చ..
Supreme Court Of India
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 06, 2023 | 10:03 PM

ఓ మహిళా జడ్జి నియామకం కంట్రీ వైడ్‌గా కాకరేపుతోంది. అసలెలా ఆమెను జడ్జిగా నియమిస్తారంటూ సుప్రీంకోర్టుకెక్కారు లాయర్లు. ఇంతకీ, ఎవరా లేడీ జడ్జ్‌? ఏంటా వివాదం? అన్నవివరాల్లోకి వెళితే.. మద్రాస్‌ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి నియామకం వివాదం చెలరేగింది. గౌరీని జడ్జిగా నియమిస్తూ కేంద్రం నోటిఫై చేయడాన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుపైనా మండిపడుతున్నారు కొందరు. గతంలో బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన విక్టోరియా గౌరి… ముస్లింలు, క్రైస్తవులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తుచేస్తున్నారు. విక్టోరియా గౌరి నియామకాన్ని తప్పుబడుతోన్న కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గౌరి నియామకాన్ని సవాలు చేస్తూ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపేందుకు అంగీకరించింది.

ఈనెల 10న దీనిపై విచారణ జరుపుతామని ప్రకటించారు సీజేఐ చంద్రచూడ్‌. విక్టోరియా గౌరిని జడ్జిగా నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మద్రాస్ హైకోర్టు లాయర్లు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు కొలీజియమ్‌కి కూడా కంప్లైంట్‌ చేశారు. గౌరి జడ్జి అయితే… ముస్లింలు, క్రైస్తవులకు న్యాయం దక్కుతుందనే నమ్మకం ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు.

సుప్రీం కొలీజియం నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండగానే కేంద్రం ఎలా ఆమోదం తెలుపుతుందని అంటున్నారు మద్రాస్ హైకోర్టు లాయర్లు. దాంతో, విక్టోరియా గౌరి వివాదం తమిళనాడుతోపాటు దేశం మొత్తం హాట్‌ ఇష్యూగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు