AP – TS Politics: తెలుగు రాష్ట్రాల్లో హీటెక్కిస్తున్న పాదయాత్రలు.. అక్కడ లోకేష్.. ఇక్కడ రేవంత్, షర్మిల..

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతల పాదయాత్రలు జోరుగా కొనసాగుతున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’.. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా సంగ్రామ యాత్ర, ఏపీలోని చిత్తూరు జిల్లాలో టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది.

AP - TS Politics: తెలుగు రాష్ట్రాల్లో హీటెక్కిస్తున్న పాదయాత్రలు.. అక్కడ లోకేష్.. ఇక్కడ రేవంత్, షర్మిల..
Telugu States Politics
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 07, 2023 | 9:28 AM

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతల పాదయాత్రలు జోరుగా కొనసాగుతున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’.. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా సంగ్రామ యాత్ర, ఏపీలోని చిత్తూరు జిల్లాలో టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది.

టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఏపీలోని చిత్తూరు జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు. చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న నారా లోకేష్ యువ గళం పాదయాత్ర.. ఇప్పటి దాకా 139.8 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. మంగళవారం 12వ రోజు చిత్తూరులో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ఉదయం 8 నుంచి 3 గంటల వరకు కొంగారెడ్డిపల్లిలోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలు నేతలతో లోకేష్ సమావేశాలు నిర్వహించనున్నారు. 3 గంటలకు అక్కడే బహిరంగ సభ జరగనుంది. సాయంత్రం 4.30 గంటలకు జిల్లా టిడిపి కార్యాలయం నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. సాయంత్రం 5.15 గంటలకు కొంగారెడ్డిపల్లి జంక్షన్ లో స్థానికులతో లోకేష్ భేటీ అవుతారు. రాత్రి 7.30 గంటలకు దిగువ మాసపల్లి వద్ద లోకేష్ నైట్ స్టే చేయనున్నారు.

రేవంత్ రెండో రోజు..

కాగా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేతల పాదయాత్రలు కొనసాగుతున్నాయి. ములుగు నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర రెండో రోజు ప్రారంభంకానుంది. రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహించిన అనంతరం రెండోరోజు పాదయాత్రను రేవంత్ రెడ్డి చేపట్టనున్నారు. పాలంపేట, కేశవాపూర్ బండారుపల్లి మీసుగా ములుగు జిల్లా కేంద్రం వరకు పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం 6గంటలకు ములుగులో కార్నర్ మీటింగ్ జరగనుంది.

ఇవి కూడా చదవండి

వైఎస్ షర్మిలా..

అదే విధంగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా సంగ్రామ యాత్ర ధర్మసాగర్ మండలంలో కొనసాగుతోంది. ఉదయం నుంచి YS షర్మిల పాదయాత్ర చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..